ప్రతి ఒక్కరి హక్కులు కాపాడబడాలి

0
349

డైరీ ఆవిష్కరణలో ఓఎన్‌జిసి అసెట్‌ మేనేజర్‌ శేఖర్‌

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 14 :దళిత ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కృషిచేస్తున్న షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ సొసైటీకి తమవంతు సహకారం అందిస్తామని ఓఎన్‌జిసి అసెట్‌ మేనేజర్‌ డిఎంఆర్‌ శేఖర్‌ అన్నారు. ఎస్‌సి ఆర్‌పి సొసైటీ డైరీలను ఈరోజు ఓఎన్‌జిసి బేస్‌ కాంప్లెక్స్‌లోని ఆయన కార్యాలయంలో దళిత రత్న, సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్వి కాశి నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసెట్‌ మేనేజర్‌ శేఖర్‌ మాట్లాడుతూ దళిత ఉద్యోగుల హక్కులు కాపాడేందుకు కృషిచేస్తున్న సొసైటీ ప్రతినిధులను అభినందించారు. బలమైన పునాదులు లేకపోతే దేశమైనా, ఇళ్ళయినా నిలవదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఆనాడే చెప్పడం జరిగిందన్నారు. సమాజంలో ప్రతీ ఒక్కరి హక్కులు కాపాడబడాలని అప్పుడే అభివృద్ధి సాధ్యమవు తుందన్నారు. కాశి నవీన్‌, తాళ్లూరి బాబూ రాజేంద్రప్రాద్‌, కోరుకొండ చిరంజీవి ఆ బాధ్యతలను స్వీకరించి ముందుకు సాగుతుండటం అభినందనీయమన్నారు. దళిత ఉద్యోగుల హక్కుల సాధనకు తన వంతు సహకారం అందిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్‌ మాట్లాడుతూ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్ఫూర్తితో ఈ సొసైటీని స్థాపించామని ఆయన అడుగు జాడల్లో నడుస్తూ షెడ్యూల్‌ కాస్ట్‌ హక్కుల పరిరక్షణకు కృషిచేస్తున్నామన్నారు. ఏ దళిత ఉద్యోగికి ఎక్కడి ఎటువంటి ఆపద వచ్చినా మేమున్నాంటూ వెళ్లి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సొసైటీ నాయకులు తురకల నిర్మల, కవులూరి వెంకటరావు, తాళ్లూరి రవిరాయల్‌, మోత నాగలక్ష్మి, జాల మదన్‌, ఆనంద్‌, ముళ్ల బాబు, ముళ్ల శ్రీనివాస్‌, పాలూరి పొసిబాబు, ఓఎన్‌జిసి ఉద్యోగుల సంఘం నాయకులు విజయపాల్‌, గని రాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here