ప్రతి శుక్రవారం ఓపెన్‌ ఫోరం సేవల్ని సద్వినియోగం చేసుకోవాలి

0
317
ప్రజలకు గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ పిలుపు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 12 : పట్టణాభివృద్ధి సంస్థల్లో భవన నిర్మాణ అనుమతులు, ఇతర సమస్యలకు సంబంధించి ప్రతి శుక్రవారం ఓపెన్‌ ఫోరం నిర్వహించాలన్న  సీఎం చంద్రబాబు ఆదేశానుసారం ఈరోజు కాకినాడలో గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ (గుడా) ఆధ్వర్యాన ఓఫెన్‌ ఫోరం నిర్వహించారు. కాకినాడలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓఫెన్‌ ఫోరంలో గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, వైస్‌ చైర్మన్‌ ఆర్‌.అమరేంద్రకుమార్‌, ఇతర అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గుడా డైరెక్టర్‌ గట్టి సత్యనారాయణ, గుడా కార్యదర్శి సన్యాసిరావు,ఇన్‌ఛార్జ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ సత్యమూర్తి, అసిస్టెంట్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ శాంతిలత తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here