ప్రత్యేక అవసరాల కోసం హోదా తాకట్టు

0
272

చిత్తశుద్ధి ఉంటే పోరాడిన వారిపై కేసులు మాఫీ చేయండి

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 12 : సీఎం చంద్రబాబు తన ప్రత్యేక అవసరాల కోసం ప్రత్యేక హోదా అంశాన్ని మోడీ వద్ద తాకట్టు పెట్టారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర యువజ న విభాగం కార్యదర్శి పోలు కిరణ్‌రెడ్డి, నగర అధ్యక్షులు మరుకుర్తి నరేష్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిరణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాను ప్రజలంతా హక్కుగా భావిస్తున్నారని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పుడు అమలు సాధ్యమో కాదో ఎందుకు చూడలేదో చెప్పాలన్నారు. 14వ ఆర్థిక సంఘాన్ని బూచిగా చూపించి ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రత్యేక హోదాకోసం పోరాడిన నాయకులపై పెట్టిన కేసులను తెదేపా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వాటిని ఎత్తి వేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగినా తెదేపా నాయకులు ఇంకా పదవులను పట్టుకుని వేలాడటం సరికాదని, ఇప్పటికైనా తెలుగు డ్రామా పార్టీగా కాకుండా ప్రజల కోసం, ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని కోరారు. మరుకుర్తి నరేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు సర్కార్‌ పూర్తిగా వైఫల్యం చెందిందని, ప్రజలకు ఏమీ చేయకపోగా అవినీతిలో ఏపీని నెంబర్‌ వన్‌-1 స్థానంలో నిలిపిన ఘనత వారికే దక్కుతుందన్నారు. నాలుగేళ్ళపాటు పదవులను అనుభవించి తమ పనులు చేయించుకుని ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలను ఇంకా మోసగించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేస్తుంటే వైకాపా ఎంపీలు కనీసం సంఘీభావం కూడా తెలపకపోవడం దారుణమన్నారు. ఈరోజు రాజమహేంద్రవరం వచ్చిన ఎంపీ మురళీమోహన్‌కు ఆ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారని, ఆయన ఏం సాధించారో ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో కొల్లి కృష్ణదీప్‌, ఎన్‌.శ్రీనాధ్‌, పి.శ్రీనివాస్‌, షరీఫ్‌, కేతా స్వరూప్‌, బడిగండ్ల శ్రీను, ఎం.డి.బాబు, ఎం.డి.సిద్ధిక్‌, మిర్యాల దుర్గాప్రసాద్‌, పుచ్చకాయల జోసఫ్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here