ప్రత్యేక హొదా కోసం విజయ్‌చందర్‌ జల దీక్ష

0
238

రాజమహేంద్రవరం, జూన్‌ 15 : ఏపీకి ప్రత్యేక హొదా కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో ఈరోజు నగరంలోని పుష్కరఘాట్‌ వద్ద గోదావరిలో జలదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు విజయచందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైకాపా సాంస్కృతిక విభాగం ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రత్యేక ¬దాను సాధించే వరకూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా విజయచందర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో నేటికీ ప్రత్యేక హొదా అంశం బ్రతికి ఉందంటే అది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వల్ల మాత్రమేనని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా సంజీవిని కాదని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు యూ టర్న్‌ తీసుకుని ప్రత్యేక ¬దా కావాలని అంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామాలు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక ¬దా ఎంతో అవసరమని, రాష్ట్రానికి ¬దాను సాధించే సత్తా కేవలం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి మాత్రమే ఉందని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను చేపట్టిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ప్రజలంతా అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా సాంస్కృతిక విభాగం రాజమహేంద్రవరం నగర అధ్యక్షులు పెదిరెడ్ల శ్రీనివాసు, వైకాపా నాయకులు కాటం రజనీ కాంత్‌, గుదే రఘు నరేష్‌, వైవి ఉదయభాస్కర్‌, సోమి శ్రీనివాసరావు, అందనాపల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here