ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్సీ సోము తనిఖీలు

0
324
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 20 : శాసనమండలి సభ్యులు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు ఈరోజు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ తీరు సరిగా లేకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో 48 మంది ప్రైవేట్‌ సెక్యూరిటీ ఉండాల్సి ఉండగా కేవలం 24 మందే పనిచేస్తున్నారని, కాంట్రాక్టర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి నిర్వహణకు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి రూ.3లక్షలు ఇచ్చేవారని, చంద్రబాబు ప్రభుత్వం రూ.14లక్షలు అందజేస్తోందన్నారు. సోము వెంట కార్పొరేటర్‌ రేలంగి శ్రీదేవి, యానాపు యేసు, మనోజ్‌కుమార్‌, ఆసుపత్రి ఆర్‌ఎంఓ పద్మశ్రీ, డాక్టర్‌ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.