ప్రభుత్వాసుపత్రిలో గుడా అభివృద్ధి పనులు: గన్నికృష్ణ

0
317
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 15:  ప్రభుత్వ ఆసుపత్రిలో గుడా ద్వారా అభివృద్ధి పనులు నిర్వహిస్తామని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రి ప్రాంగణంలో రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమేష్‌ కిషోర్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం గన్ని కృష్ణ మాట్లాడుతూ గుడా ద్వారా పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడంపై దృష్టి సారించామని తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వాసుపత్రిలో మాతా శిశు విభాగం వద్ద పచ్చదనాన్ని అభివృద్ధి చేయడానికి, ఆసుపత్రి ప్రాంగణంలో రోగులు, వారి బంధువులు విశ్రాంతి తీసుకోవడానికి బ్లాక్‌ నిర్మించేందుకు రూ.36 లక్షలతో అంచనాలు వేశారని, దానికి గుడా నుంచి నిధులు మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌, తెదేపా నాయకులు మరుకుర్తి రవియాదవ్‌, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్‌ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here