ప్రభుత్వాసుపత్రి పరమావధిని నెరవేర్చండి

0
295
వైద్యులకు సూచించిన సిటీ ఎమ్మెల్యే
రాజమహేంద్రవరం,జూలై 25 :  ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సిటీ శాసనసభ్యులు డా.ఆకుల సత్యనారాయణ వైద్యులను అదేశించారు. కిడ్ని భాధితులు తమకు సరైన వైద్యం అందటం లేదని చేసిన ఫిర్యాదును పురష్కరించుకోని ఈరోజు ఆయన రాజమహేంద్రవరం ప్రభుత్వ అసుపత్రిని సందర్శించారు. డిమాండ్‌కు తగ్గటుగా ప్రణాళిక రూపొందించుకుని సేవలు అందించాలని అయన అన్నారు. అసుపత్రిలో  రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి బాథితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వఆసుపత్రిలో అనేక సమస్యలు ఉన్నట్టు తన దృష్టికి వచ్చాయని వాటీని పరిష్కారించేందుకే ఆసుపత్రిని సందర్శించానని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒ.పి విభాగంలో ఎక్కువ సేపు క్యూలో నిలబడే అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌.ఎం.ఒ.లక్ష్మిపతికి సూచించారు.అనంతరం అయన మాతా, శిశు వార్డులను సందర్శించి అక్కడ అనాథ పిల్లల కోసం ఏర్పాటుచేసిన అమ్మ ఊయలను ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య నిమిత్తం కోసం పేదవారే వస్తారని వారికి అవసరమయ్యే వైద్య సేవలు అందించాలని డాక్టర్‌లకు ఆయన సూచించారు.  ముఖ్యంగా డయాలిసిస్‌ రోగులు చికిత్స కోసం ఎం.ఎల్‌.ఎ  సిఫార్సు కోసం వస్తున్నారని, ఆ అవసరం లేకుండా  ప్రభుత్వమే నేరుగా వారికి  సకాలంలో అవసరమయిన వైద్యం అందించే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డా.నాయక్‌, అసుపత్రి ఆర్‌.ఎం.ఒ.లక్ష్మిపతి, బిజెపి నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్‌, లాల్‌ బహుదుర్‌ శాస్త్రీ, అయ్యల గోపి, నాళం పద్మశ్రీ, అడ్డాల ఆదినారాయణ మూర్తి, మట్టాడి చిన్ని, రౌతు వాసు, సి.హెచ్‌.కామేశ్వరరావు, గోవిందు, రుత్తుల చిన్ని, కొప్పిశెట్టి లోవరాజు, రాజేశ్వరి, రాజ్యాలక్ష్మి, సుబ్బలక్ష్మి, గౌస్య, తులసి తదితరులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here