ప్రభుత్వ అమానుషత్వం..తూర్పు  తెలుగుదేశం నేతలు 

0
150

రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 11 :  గుంటూరులో ఏర్పాటు చేసిన వైసీపీ బాధిత శిబిరంలో వున్నవారికి ఆహార పదార్థాలు సరఫరా చేయకుండా నిలిపి వేయటం ప్రభుత్వ అమానుషత్వానికి నిదర్శనం అని తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గోదావరి అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ మాజీ చైర్మన్‌ గన్ని కష్ణ, శాసనమండలి మాజీ సభ్యుడు  ఆదిరెడ్డి అప్పారావు, కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి తదితరులు బుధవారం గుంటూరులోని బాధితుల శిబిరం వద్దకు పరామర్శ నిమిత్తం వచ్చేందుకు సిద్ధమయ్యారు. శిబిరం వద్దకు చేరుకొిక ముందే గుంటూరులో పోలీసుల వారిని అరెస్ట్‌ చేసి నిర్బంధంలో వుంచారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ పోలీసుల చర్యను తప్పుబట్టారు. గుంటూరు జిల్లా పల్నాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజల నివాసహక్కును ప్రభుత్వం హరించువేసిందని వారు ఆరోపించారు. వారి హక్కుల పరిరక్షణ కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్‌ చేయటం శోచనీయమని వారు పేర్కొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here