ప్రభుత్వ ఆసుపత్రిలో ఐ.సి.యు.యూనిట్‌ ప్రారంభించిన కలెక్టర్‌                    

0
269
రాజమహేంద్రవరం, నవంబర్‌ 27: మహిళా పేషెంట్లకు ఏర్పాటుచేసిన ఐ.సి.యు.యూనిట్‌ను పూర్తిస్థాయిలో వినియోగించాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 32 లక్షలతో ఏర్పాటుచేసిన గైనిక్‌ ఐ.సి.యు.యూనిట్‌ను ఆయన ప్రాంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఐ.సి.యు.యూనిట్‌లో 6 మంచాలు, మోనిటర్‌ ఇంకా ఇతర పరికరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మహిళలు ప్రసవించిన సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు ఎమ్‌.కుమార్‌ మీనా, కమిషనర్‌ సుమిత్‌ కుమార్‌,రంపచోడవరం సబ్‌-కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ టి.రమేష్‌కిషోర్‌, డాక్టర్లు కోమలి, పద్మశ్రీ, లక్ష్మి పతి, నాయక్‌, తేతలి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here