ప్రమాదపు మలుపులు పట్టించుకోండి

0
374

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6 : రోజురోజుకీ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు నివారించే దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు దాస్యం ప్రసాద్‌ కోరారు. అవగాహనారాహిత్యంతో, అతివేగంతో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల పర్యటించి ప్రమాదంగా ఉన్న మలుపులను గుర్తించామన్నారు. మూలగొయ్యి సెంటర్‌, నందంగనిరాజు జంక్షన్‌ – బైపాస్‌రోడ్‌ మలుపు, పుష్కరఘాట్‌ (శ్రీదుర్గా హోటల్‌), విశ్వేశ్వరస్వామి ఆలయం, వీరభద్రపురం – లలితానగర్‌ జంక్షన్‌, గోపాల్‌నగర్‌ పుంత, ఐసిడిఎస్‌ ప్రాంతాలు ప్రమాదకరంగా ఉన్నాయని, అక్కడ పరిస్థితులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నగర, రూరల్‌ అధ్యక్షులు గెడ్డం నాగరాజు, విత్తనాల శివ వెంకటేష్‌, ఉల్లూరి రాజు, శ్యామ్‌, మైసర్ల సంతోష్‌, సతీష్‌, లోవ, యువరాజు, సంజు, ప్రదీప్‌, కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here