ప్రశాంతంగా పోలింగ్‌

0
501
రాజవీధిలో చాంబర్‌ ఎన్నికల సందడి
రాజమహేంద్రవరం,సెప్టెంబర్‌ 30 : ప్రతిష్టాత్మక ది రాజమండ్రి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.  పోలింగ్‌ ఏర్పాట్లలో ఆలస్యం కావడంతో ఉదయం 9 గంటలకు ప్రారంభం కావలసిన ఎన్నికలు  10.15 గంటలకు ప్రారంభమైంది. చాంబర్‌ ఎన్నికల సందర్భంగా మెయిన్‌రోడ్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. ఓటేసే స్లిప్పు ఉన్న వారిని మాత్రమే ఎన్నికలు జరుగుతున్న చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లోకి అనుమతించారు. రెండు ప్యానళ్లకు చెందిన మద్ధతుదారులు భారీగా మోహరించడంతో ఎన్నికల సందడి నెలకొంది. వారు వేసిన శిబిరాల వద్ద అనుచరగణం ఎక్కువగా ఉండటంతో పోలీసులు వాటిని తొలగించి ఎన్నికల కేంద్రానికి దూరంగా తరలించారు. మొత్తం  2 వేల 810 ఓట్లు వర్తకులకు ఉండగా 70 ఓట్లు కలిపి మొత్తం 2 వేల 880 ఓట్లు ఉండగా ఓట్లు వేసేందుకు వ్యాపారులు బారులు తీరారు. ఎన్నికల అధికారులుగా మారిశెట్టి వెంకట రామారావు, గమిని గంగయ్య వ్యవహరిస్తుండగా కురగంటి సతీష్‌, రొబ్బి విజయశేఖర్‌, కోడూరి శాంతారామ్‌, గ్రంధి పిచ్చయ్యలు  ఎన్నికల అధికారులకు సహాయకులుగా వ్యవహరించారు. రెండు ప్యానెళ్లు చాంబర్‌ ఎన్నికల బరిలో ఉండగా ఒక ప్యానెల్‌కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, మరొక ప్యానెల్‌కు తెలుగుదేశం పార్టీ మద్ధతుగా నిలిచాయి.వైకాపా బలపరిచిన లక్ష్మీ నారాయణ జవ్వార్‌-మద్దుల మురళీకృష్ణ ప్యానెల్‌, టీడీపీ బలపరిచిన దొండపాటి సత్యంబాబు-గ్రంథి రామచంద్రరావు ప్యానెల్‌కు చెందిన అభ్యర్థులందరూ పోలింగ్‌ కేంద్రానికి సమీపంలోనే ఉండి ఎన్నికల్లో తమకే ఓటేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేసారు. గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు,మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైసిపి రూరల్‌ కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు,మాజీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, టీడీపీ నాయకులు యర్రా వేణు, టీడీపీ యువనేత ఆదిరెడ్డి వాసు, కాశి నవీన్‌,  చాంబర్‌ మాజీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌, కొల్లేపల్లి శేషయ్య, పొలసానపల్లి హనుమంతరావు, అశోక్‌కుమార్‌ జైన్‌, బొమ్మన రాజ్‌కుమార్‌, నగర ప్రముఖులు పట్టపగలు వెంకట్రావు, మదనగోపాల్‌, అయ్యల గోపి, పంతం కొండలరావు, బండారు మధుసూధనరావు తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా, వైసిపి యువనేత జక్కంపూడి గణేష్‌ తదితరులు ఎన్నికల సరళిని పరిశీలించారు. రెండు ప్యానెళ్ల అధ్యక్ష అభ్యర్థులు లక్ష్మీనారాయణ జవ్వార్‌, దొండపాటి సత్యంబాబు, ఇతర ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here