ప్రియదర్శినిలో మహేష్‌బాబు జన్మదిన వేడుకలు

0
379
రాజమహేంద్రవరం, ఆగస్టు 9 : ప్రిన్స్‌ ప్రసాద్‌ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రియదర్శిని చెవిటి, మూగ ఆశ్రమ పాఠశాలలో మహేష్‌బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్ధులకు అల్పాహారం, బిస్కట్లు పంపిణీ చేశారు. ముఖ్యఅతిధిగా ఎపిఐఐసి మాజీ చైర్మన్‌ శ్రిఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం పాల్గొని కేక్‌ కట్‌ చేశారు. పుట్టినరోజు సందర్భంగా మహేష్‌బాబు అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ కొయ్యల రమణ, ఘట్టమనేని యువత కేబుల్‌ సతీష్‌, వల్లభ, ఖాదర్‌, చిన్ని సురేష్‌, రవి, రాజు, వెంకటరమణ, సాయి, ఫణీంద్ర, కోళ్ళు రమణ, నంద కిషోర్‌, మణికంఠ, నరేష్‌, భద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here