ప్రెస్‌క్లబ్‌లో న్యూఇయర్‌ వేడుకలు 

0
237
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 31 : ది రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం రాత్రి న్యూఇయర్‌ వేడుకలు నిర్వహించారు. జిల్లా ఎలక్ట్రానిక్‌ మీడియా అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు కుడిపూడి పార్ధసారధి నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబ వాతావరణంలో పాత్రికేయ మిత్రులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. 31, జనవరి 1వ తేదీలలో వృత్తిరీత్య పాత్రికేయులు బిజీగా ఉండే నేపధ్యంలో ఒకరోజు ముందుగానే ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పురస్కారాలు అందుకున్న ఫొటోగ్రాఫర్‌లు గరగ ప్రసాద్‌(సాక్షి), ఎస్‌ రాంబాబు(హిందూ), రాజేశ్వరరావు(ఆంధ్రభూమి), మణికంఠ(డెక్కన్‌ క్రానికల్‌)లను సత్కరించారు. సీనియర్‌ జర్మలిస్టు, రచయిత దీక్షితులు సుబ్రహ్మణ్యంను సత్కరించారు. ఈ కార్యక్రమానికి సాక్షి సాయంకాల పత్రిక సంపాదకులు గన్ని కృష్ణ హాజరై పాత్రికేయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిఎ భూషణ్‌బాబు, సారధి, డిఎ లింకన్‌, దీక్షితులు, నమ్మి శ్రీనివాస్‌(ఎన్‌ఎస్‌), కూసెట్టి శ్రీనివాస్‌(నాని), జె కళాధర్‌, దేవులపల్లి , ఆంధ్రభూమి సబ్‌ఎడిటర్‌ నాగేశ్వరరావు, ఐ ఛానల్‌ ప్రసాద్‌ తదితరులు మాట్లాడుతూ కుటుంబ వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. వివిధ పత్రికకులు, ఛానల్స్‌కు చెందిన పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్‌లు, కెమెరామెన్‌లు హాజరయ్యారు.