ప్రేమనగర్‌’కి 45 ఏళ్ళు 

0
248
తెలుగు సినీ పరిశ్రమ ఆవిర్భవించి 85 సంవత్సరాలైంది. అక్కినేని నటనా ప్రస్థానంలో మైలురాయిలా నిలిచిపోయిన ప్రేమనగర్‌ సినిమా వచ్చి  నేటికి 45 సంవత్సరాలైంది. ఎందరో జీవితాలను ముఖ్యంగా నిర్మాత, సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత దగ్గుబాటి రామానాయుడు సినీ జీవితాన్ని మలుపు తిప్పిన ఈ చిత్రం 1971 సెప్టెంబర్‌ 24న విడుదలైంది. ఇప్పటికి వచ్చిన తెలుగు సినిమాల సంఖ్య 7,601 కాగా ఎప్పటికీ కొత్త సినిమాలా ఉండే చిత్రం ప్రేమనగర్‌ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. మొదటి జనాదరణ పొందిన చిత్రం దేవదాసు  1953 జూన్‌ 26 కాగా మరొకటి విజయా వారి మాయబజార్‌ చిత్రం 1957లో  విడుదలైంది. ఇక్కడ విశేషమేమిటంటే ఈ మూడు చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు నటించడం. ప్రేమనగర్‌ కథ సారాంశంలోకి వెళితే….పౖౖెలాపచ్చీసుగా తిరిగే జమీందార్‌ కళ్యాణ్‌ వద్ద ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఎయిర్‌ ¬స్టస్‌ లత (వాణిశ్రీ) తారసపడుతుంది. తరువాత ఆమెను తన సెక్రటరీగా నియమించుకుంటారు. ఆమెయే లత. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఆమె మతం. లత వ్యక్తిత్వంతో ఆమె పట్ట కళ్యాణ్‌ ఆకర్షితులు కాగా వీరిద్దరి మధ్య ప్రేమ మొగ్గ తొడుగుతుంది. ఆ ప్రేమకు గుర్తుగా ప్రేమనగర్‌ నిర్మిస్తారు. ఆ తర్వాత వీరు ఒకటవడానికి ఎన్నో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. కుట్రతో తనపై అభాండాలు వేయడంతో కళ్యాణ్‌ను కాదని వెళ్ళిపోయిన లత ఎంత మధన పడుతుందో? లత ప్రేమను మరువలేక కళ్యాణ్‌ ఎంత విరహవేదనకు గురవుతారో ఈ చిత్రం చక్కగా అద్దం పట్టింది. లత  విరహాన్ని భరించలేక విషం తాగిన కళ్యాణ్‌ను ఆఖరిలో నిజాలు తెలుసుకున్న లత ఎలా కలుసుకుందో తెలియజేసే సన్నివేశాలు హృదయాన్ని  హత్తుకుంటాయి. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఆత్రేయ మాటలు, పాటలు ఈ చిత్రానికి ప్రాణం పోశాయి. సన్నివేశాల చిత్రీకరణ కూడా హైలెట్‌గా నిలిచాయి.1971లో ఈ చిత్రం విడుదలైనపుడు వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి హిట్‌ టాక్‌ రావడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ చిత్రంలో అక్కినేని, వాణిశ్రీల నటన పోటాపోటీగా సాగింది. ఈ చిత్రంలో రామానాయుడు తనయుడు, నేటి హీరో వెంకటేష్‌ బాలనటునిగా కనిపిస్తారు. వర్షాల్లో కూడా కనకవర్షం కురిపించిన ఈ చిత్రం ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌ రొమాంటిక్‌గా నిలుస్తుంది.
 
                                                                                                               అడబాల మరిడయ్య                                                                                                                      కాపు, దొడ్డిగుంట