ప్రైవేట్‌కు ధీటుగా….

0
291
కార్పొరేషన్‌ పాఠశాలల్లో  టెన్త్‌లో ‘సూపర్‌ సిక్ట్సీ’ బ్యాచ్‌
వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కమిషనర్‌ విజయరామరాజు
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 19 : ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో నగర పాలక సంస్థ విద్యార్ధులు కూడా ఉత్తమ ఫలితాలను సాధించాలన్న లక్ష్యంతో నగర పాలక సంస్థ కమిషనర్‌ వి.విజయరామరాజు ‘సూపర్‌ సిక్ట్సీ’ కార్యక్రమాన్ని చేపట్టారు. నగర పాలక సంస్థ పరిధిలోని పాఠశాలల్లో పదవ తరగతి చదివే విద్యార్ధుల్లో ప్రతిభ గల 60 మందిని ఎంపిక చేసి వారికి నారాయణపురం నగర పాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఉచిత రెసిడెన్షియల్‌ శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఎంపి మురళిమోహన్‌, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, కమిషనర్‌ విజయరామరాజు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నగర పాలక సంస్థ ద్వారా మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, విద్యార్ధులంతా తమ తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయకుండా అత్యుత్తమ మార్కులు రాబట్టి వారికి, నగర పాలక సంస్థకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. నగర పాలక సంస్థ చేసిన ఈ కార్యక్రమం పట్ల విద్యార్ధుల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పితాని లక్ష్మీకుమారి, పాలిక శ్రీను, కొమ్మా శ్రీనివాస్‌, గొందేశి  మా ధవీలత, పైడిమళ్ళ మెర్సీప్రియ, రెడ్డి పార్వతి, కడలి రామకృష్ణ, అదనపు కమిషనర్‌  శ్రీనివాస్‌, డిప్యూటీ కమిషనర్‌ ఫణిరామ్‌, పాఠశాలల సూపర్వైజర్‌ దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.