ప్రైవేట్‌ స్ధలాలు కొనుగోలు చేసి పేదలకు సొంతిళ్ళు 

0
168
14వ డివిజన్‌లో గృహ లబ్ధిదారుల ఎంపికలో గన్ని, ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 15 : పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే ప్రైవేట్‌ స్ధలాలను కొనుగోలు చేస్తున్నారని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్ధానిక 14 వ డివిజన్‌లో ఈరోజు గృహ లబ్ధిదారుల ఎంపిక నిమిత్తం డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, డివిజన్‌కు చెందిన చిన్నారులతో డ్రా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసమే తెదేపా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి గృహాలు సమకూర్చేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్రం ఆర్ధిక లోటుతో సతమతమవుతున్నా సంక్షేమం విషయంలో రాజీ పడటం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌, కార్పొరేటర్‌ ఈతకోట బాపన సుధారాణి, అదనపు కమిషనర్‌ జి.సత్యనారాయణ, తెదేపా నాయకులు ఈతలపాటి కృష్ణ,మాలే విజయలక్ష్మీ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here