ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై ప్రిివిలైజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తాం

0
220
శాసనసభ్యురాలుకి తగిన గౌరవం ఇవ్వాలి
రాజమహేంద్రవరం, నవంబర్‌ 9 : మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా శుక్రవారం స్ధానిక మదీనా మసీదు షాదీఖానాలో జరిగిన కుట్టు మిషన్‌ల పంపిణీ కార్యక్రమానికి స్ధానిక శాసనసభ్యురాలిని ఆహ్వానించకపోవడం సరికాదని టిడిపి మైనార్టీ సెల్‌ నాయకులు షేక్‌ సుభాన్‌, ఎండి ఛాన్‌బాషా, ఉన్నీషాలు పేర్కొన్నారు. స్థానిక తిలక్‌రోడ్‌లోని సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సుభాన్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మైనార్టీ మహిళలకు శిక్షణ ఇచ్చి, కుట్టుమిషన్‌లను మంజూరు చేయించామని, ఆ మిషన్‌లనే ఇప్పుడు వైకాపా ప్రభుత్వంలో అట్టహాసంగా పంపిణీ చేశారన్నారు. వైసిపి ప్రభుత్వంలోనే మహిళకు శిక్షణ ఇచ్చి, కుట్టుమిషన్‌లు అందించనట్లుగా వైకాపా గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వపరంగా నిర్వహించే కార్యక్రమాలకు రాజ్యాంగబద్ధంగా ఎన్నికయిన ప్రజాప్రతినిధిని ఆహ్వానించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ విధంగా ఆహ్వానించకుండా అధికారులు ప్రొటోకాల్‌ ఉల్లంఘించారన్నారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై న్యాయస్ధానాకి వెళతామని, ప్రివిలైజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. వైసిపి ప్రభుత్వానికి, నేతలకు చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వ హయాంలో మసీదులు, షాదీఖానాల అభివృద్ధికి అనేక నిధులు మంజూరు చేయించామని, ఆ నిధులతో అభివృద్ధి పనులు చేయించి, ప్రారంభించుకోవాలని సూచించారు. ఈ ప్రభుత్వంలో పనులు చేసినా బిల్లులు వస్తాయో లేదో అన్న అనుమానంతో పనులు చేయడానికి ఏ కాంట్రాక్టర్‌ ముందుకు రావడంలేదని ఎద్దేవా చేశారు. ఇది రద్దుల ప్రభుత్వం అని అన్నీ రద్దు చేయడం తప్ప అభివృద్ధి చేయడం తెలియదన్నారు. టిడిపి నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి మాట్లాడుతూ ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై ప్రివిలైజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యురాలుకి తగిన గౌరవం ఇవ్వాల్సి ఉందన్నారు. అధికారంలో ఉన్న వారికే కొమ్ముకాసే వైఖరిని అధికారులు విడనాడాలన్నారు. ఛాన్‌ బాషా, ఉన్నీషాలు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా జరిగిన కార్యక్రమానికి శాసనసభ్యురాలికి సమాచారం ఇవ్వకపోవడం సరికాదన్నారు. విలేకరుల సమావేశంలో సయ్యద్‌ అప్సరీ, ఎస్‌కె రఫీ, షేక్‌ ఖాసిం, షయ్యద్‌ ఉమర్‌, షయ్యద్‌ ఫయాజ్‌, షాజహాన్‌, సుకూర్‌ తదితరులు పాల్గొన్నారు.
అయోద్యపై సంయమనం పాటిద్దాం
వివిదాస్పద ఆయోద్య అంశంపై దేశ అత్యున్నత న్యాయస్ధానం ఎటువంటి తీర్పు ఇచ్చినప్పటికీ సంయమనం పాటిద్దామని టిడిపి మైనార్టీ నాయకులు షేక్‌ సుభాన్‌ సూచించారు. అనుకూలంగా తీర్పు వస్తే సంబరాలు జరుపుకోవద్దని, వ్యతిరేకంగా తీర్పువస్తే ఆందోళన చెందొద్దని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here