ప్లంబింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నేత కుటుంబానికి ఆర్ధిక సహాయం

0
273
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  31 : రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించిన తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులు, ప్లంబింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు నేతుల మధుసూదనరావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 2 లక్షల ఆర్ధిక సహాయాన్ని  రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చేతుల మీదుగా పంపిణీ చేశారు. తెదేపా కార్యకర్తలెవరైనా మరణిస్తే వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలనే ఉద్ధేశ్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీ ఏర్పాటు చేసిన కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి ఈ సహాయం అందజేశామని తెలిపారు. ఈ పథకం కార్యకర్తల కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉంటుందోనని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిఎన్‌టియుసి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నక్కా చిట్టిబాబు, యర్రమోతు ధర్మరాజు, కాపు కార్పొరేషన్‌ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గంగిన హనుమంతరావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, కాతేరు మాజీ సర్పంచ్‌ ఎలిపే బాబూరావు, బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు తీడ నరసింహరావు, ఎలక్ట్రికల్‌ యూనియన్‌ అధ్యక్షులు వై.శ్రీనివాసరావు, బొజ్జా రామకృష్ణ, ప్లంబింగ్‌ యూనియన్‌ అధ్యక్షులు బి.రమేష్‌కుమార్‌, పి.శివ, జి.శ్రీను, రాక్‌ బెండింగ్‌ యూనియన్‌ అధ్యక్షులు మల్లేశ్వరరావు, కె.విశ్వనాధరాజు, తవ్వా రాజా, పితాని కుటుంబరావు, జి.ప్రకాష్‌, జి.రమేష్‌, వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల చిన్నారావు, పిన్నింటి రవిశంకర్‌, వేముల రాంబాబు, పొడుగు శ్రీను పాల్గొన్నారు.