ఫిర్యాదులొస్తే ఉపేక్షించేదీ లేదు

0
293

రేషన్‌ డీలర్‌కు గుడా చైర్మన్‌ గన్ని హెచ్చరిక

రాజమహేంద్రవరం, మార్చి 10 : పేదలకందించే నిత్యవసరాల విషయంలో రేషన్‌ డీలర్లు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. స్ధానిక 49 వ డివిజన్‌లో జరిగిన దళితతేజం- తెలుగుదేశం కార్యక్రమంలో కొందరు మహిళలు తమ ప్రాంతంలోని రేషన్‌ దుకాణంలో సరకులు సక్రమంగా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన గన్ని మహిళలతో కలిసి రేషన్‌ దుకాణం వద్దకు వెళ్ళారు. ఫిర్యాదులపై డీలర్‌ను ప్రశ్నించారు.ఇటువంటి ఫిర్యాదులు మళ్ళీ రాకుండా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికలోటుతో సతమతమవుతున్నా సీఎం చంద్రబాబు సంక్షేమం విషయంలో రాజీ పడకుండా కృషి చేస్తుంటే రేషన్‌ డీలర్లు ఈ విధంగా వ్యవహరించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించవద్దని సూచించారు. గన్ని వెంట కాశి నవీన్‌కుమార్‌, రాచపల్లి ప్రసాద్‌, ఆదిరెడ్డి వాసు, పెయ్యల శ్రీను, మరుకుర్తి దుర్గాయాదవ్‌, జాగు వెంకటరమణ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here