ఫోటోగ్రాఫర్‌ సత్యనారాయణకు పుత్ర వియోగం 

0
768
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 13 : ప్రెస్‌ ఫోటోగ్రాఫర్‌ ఆర్‌వివి సత్యనారాయణ పెద్ద కుమారుడు శ్రీనివాస్‌ (18) ఈరోజు ఉదయం మృతి చెందాడు. డెంగ్యూ, మలేరియా, వైరల్‌ ఫీవర్‌తో గత వారం రోజులుగా ఆర్యాపురంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉండి చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ పరిస్థితి విషమించడంతో  తుది శ్వాస విడిచాడు. స్ధానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అతడి మరణంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.  ఈ విషయం తెలియగానే పలువురు పాత్రికేయులు దేవీచౌక్‌ సమీపాన పశువుల ఆసుపత్రి వద్ద ఉన్న సత్యనారాయణ ఇంటికి వెళ్ళి శ్రీనివాస్‌ భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించి తమ సానుభూతి తెలిపారు. ఈ సాయంత్రం అతడి భౌతికకాయానికి అంతిమ సంస్కరణలు నిర్వహించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here