‘బడిబాట’లో గోరంట్ల

0
77
రాజమహేంద్రవరం, జూన్‌ 15 : ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని ధవళేశ్వరంలోని ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని పిల్లలకు పుస్తకాలు, షూలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉన్నతమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. కావున విద్యార్థుల తల్లీదండ్రులు తమ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here