బత్తిన తిరుపతయ్య ట్రస్ట్‌ మరిన్ని సేవలతో వర్ధిల్లాలి 

0
353
7వ వార్షికోత్సవంలో పలువురు ఆకాంక్ష
రాజమహేంద్రవరం, జులై 2 :  ఎక్సైజ్‌ డిపార్ట్‌ మెంట్‌లో పనిచేసి పదవీ విరమణ తర్వాత బత్తిన తిరుపతయ్య అండ్‌ రామచంద్ర మాణిక్యం చారిటబుల్‌  ట్రస్ట్‌ నెలకొల్పి విద్య తదితర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ట్రస్ట్‌ వ్యవస్థాపకులు బత్తిన స్వామి తన జీవితాన్ని సార్ధకం చేసుకోవడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొంటూ  ట్రస్ట్‌ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపట్టి, చిరకాలం వర్ధిల్లాలని  ఆకాంక్షించారు. ఎన్జీజిఓ హోమ్‌లో  ట్రస్ట్‌ 7వ వార్షిక వేడుకలు, అలాగే బత్తిన స్వామి 75వ జన్మదిన వేడుకలు సంయుక్తంగా  ఆత్మీయ పూరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. ప్రముఖ న్యాయవాది జి ఎస్‌ ఎస్‌ మురళీమోహన్‌ ముఖ్య అతిధిగా పాల్గొంటూ చాలామంది డబ్బులున్నా సరే సేవలు చేయలేరని అయితే బత్తిన స్వామి ట్రస్ట్‌ ద్వారా విస్త త కార్యక్రమాలు చేస్తూ ట్రస్ట్‌ నిరంతరం కొనసాగేలా ప్రణాళిక రూపొందించడం అభినందనీయమన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన ప్రభుత్వ ఆసుపత్రి ఫిజీషియన్‌ డాక్టర్‌ టి చంద్రశేఖర్‌ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటూ, బత్తిన స్వామి చేస్తున్న వితరణ కార్యక్రమాలు తనకు స్ఫూర్తినిచ్చాయన్నారు. వైజాగ్‌ ఇమ్మానియేలు లూథరన్‌ చర్చి డాక్టర్‌ రెవరెండ్‌ కె సాల్మన్‌ చక్రవర్తి, రిటైర్డ్‌ లెక్చరర్‌ విల్సన్‌ డేవిడ్‌ రాజు తదితరులు ప్రసంగించారు. రిటైర్డ్‌  డిస్ట్రిక్ట్‌ సోషల్‌ వెల్ఫ్ర్‌ ర్‌ ఆఫీసర్‌ బిసిబి శ్యాంబాబు,డిపిఆర్‌ ఓ రామమోహనరావు,కోరుకొండ చిరంజీవి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా పోస్టర్లకు బట్టలు, ఆర్ధిక సాయం అతిధుల చేతుల మీదుగా బత్తిన స్వామి అందజేశారు.   వ ద్ధులకు, వికలాంగులకు సాయం అందించారు. బత్తిన స్వామి దంపతులను పలువురు పూల మాలలతో అభినందించారు.  విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. ఎన్జీవో నాయకులు బీపీఎల్‌ జాన్సన్‌, ట్రస్ట్‌ సభ్యులు  బాబు, రషీద్‌,రాజు, ప్రసన్న కుమార్‌, రాజబాబు,జాన్సన్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here