బాడి బిల్డర్స్‌ అసోషియేషన్‌ జిల్లా అధ్యక్షునిగా ఆదిరెడ్డి వాసు 

0
512
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 4 : జిల్లా బాడీ బిల్డర్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షునిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, భవాని చారిటబుల్‌ ట్రస్ట్‌ ఎం.డి.   ఆదిరెడ్డి వాసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్ధానిక కోటిపల్లి బస్టాండ్‌ వద్ద ఉన్న గౌతమీ వ్యాయామ కళాశాలలో జిల్లా బాడి బిల్డర్స్‌ అసోషియేషన్‌ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ఒలింపిక్‌ అసోషియేషన్‌ ఉపాధ్యక్షులు ఎస్‌.రామరాజు, జిల్లా స్పోర్ట్‌ అధారిటి కోచ్‌ ఎం అచ్యుత్‌కుమార్‌ పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరిగింది. కోచ్‌ కార్యదర్శిగా ఆవాల సత్యనారాయణ, కోశాధికారిగా ఏలూరి మధుసూదనరావు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ బాడి బిల్డర్స్‌ అసోషియేషన్‌ కార్యదర్శి అడ్డూరి వెంకటరమణ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. 17 మందితో ఎన్నికైన నూతన కమిటీని పలువురు అభినందించారు.