బాబుకు ఐదుకోట్ల ఆంధ్రుల దన్ను

0
264

వంద ఆపరేషన్‌ గరుడలు చేసినా ఆయనను ఏమీ చేయలేరు

కేంద్రం వివక్షపై గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ ధర్మాగ్రహం

నగరంలో ఉత్సాహంగా సాగిన తెదేపా బైక్‌ ర్యాలీ- మహనీయుల విగ్రహాలకు క్షీరాభిషేకాలు

రాజమహేంద్రవరం, మార్చి 24 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాటం చేస్తున్న సీఎం చంద్రబాబునాయుడుపై వంద ఆపరేషన్‌ గరుడలు చేసినా ఆయనను ఏమీ చేయలేరని, ఆయన వెనుక ఐదు కోట్ల మంది ఆంధ్రులు అండగా ఉన్నారని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరశిస్తూ ఆందోళన చేపట్టారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన నందమూరి తారక రామారావు, భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఆత్మత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు, భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాలకు క్షీరాభిషేకం చేసి పెద్ద ఎత్తున నగరంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ముందుగా కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌లో ఎన్‌టిఆర్‌ విగ్రహానికి గన్ని, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, డిప్యూటీ మేయర్‌ , నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాసిరెడ్డి రాంబాబు, ప్రధాన కార్యదర్శి రెడ్డి మణేశ్వరరావు (మణి), ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, తెదేపా యువ నాయకులు ఆదిరెడ్డి వాసు తదితరులు క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి బైక్‌ ర్యాలీ ప్రారంభించి డీలక్స్‌ సెంటర్‌, మెయిన్‌రోడ్డు మీదుగా కోటగుమ్మం సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. అక్కడ నుంచి పుష్కరఘాట్‌ మీదుగా గోకవరం బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహానికి కూడా వారితో పాటు కాపు కార్పొరేషన్‌ యర్రా వేణుగోపాలరాయుడు పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఆపరేషన్‌ గరుడ ప్లెక్సీని దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ తెదేపా శ్రేణులు ఈ బైక్‌ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన హామీలు, మంజూరు చేసిన నిధుల వివరాలను తెలియజేస్తూ ఫ్లకార్డులను ప్రదర్శించి నినాదాలు వినిపించారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ మోడీ సర్కార్‌పై చంద్రబాబు చేస్తున్న పోరాటం ఇప్పుడే ఆరంభమైందని, వారు ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొని రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తామన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబును అపఖ్యాతి పాల్జేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికే తెలుగు జాతిలో ఐక్యతను దెబ్బతీశారని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన భగత్‌సింగ్‌ స్ఫూర్తితో కేంద్రంపై యుద్ధానికి తాము సిద్ధమని, దేశద్రోహులు, రాష్ట్ర ద్రోహలను తరిమి కొట్టాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన కేంద్రంతో వైకాపా నేతలు దోస్తీ కడుతూ వారి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం దారుణమన్నారు. ఒకవైపు కేంద్రంపై తమకు విశ్వాసం ఉందంటూనే పార్లమెంట్‌లో ఎందుక అవిశ్వాస తీర్మానం కోరారో చెప్పాలన్నారు. ఆపరేషన్‌ గరుడ అంటూ బెదిరించే ధోరణికి కేంద్రం ప్రయత్నిస్తోందని, ఇలాంటి కుట్రలను చంద్రబాబు చాలా చూశారన్నారు. గుజరాత్‌లో జరిగిన స్కాంలు చూస్తే మోడీ గొప్పతనం తెలుస్తుందన్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఆధ్వర్యంలో నియమించిన నిజ నిర్ధారణ కమిటీ కేంద్రం సహాయం అందించడంలో చూపిన వివక్షను బహిర్గతం చేసినా ఆయన నిర్వహించిన సభలో ఈ అంశాలను ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.ఈ కమిటీలో ఓ వ్యక్తి పోలవరం నిర్మాణంలో చంద్రబాబు కృషిని కొనియాడుతూ బాబు వలనే నిర్మాణం సాధ్యమవుతోందని గతంలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. మరో వ్యక్తి మొదటి నుంచి చంద్రబాబుకు బద్ధ శత్రువని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా ఆయన వెంటే ఉంటామని, ఆయన పోరాటంలో సైనికుల్లా వ్యవహరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, కార్పొరేటర్లు బెజవాడ రాజ్‌కుమార్‌, బూర దుర్గాంజనేయరావు, యిన్నమూరి రాంబాబు, మర్రి దుర్గా శ్రీనివాస్‌, గాదిరెడ్డి బాబులు, తంగెళ్ళ బాబి, కడలి రామకృష్ణ, సింహ నాగమణి, మాటూరి రంగారావు, పార్టీ నాయకులు కురగంటి సతీష్‌, బట్లంకి ప్రకాష్‌, యిన్నమూరి దీపు, బుడ్డిగ రాధ, చిట్టూరి ప్రవీణ్‌ చౌదరి, మరుకుర్తి రవి యాదవ్‌, కవులూరి వెంకట్రావ్‌, అరిగెల బాబూ నాగేంద్ర ప్రసాద్‌, మజ్జి రాంబాబు, సూరంపూడి శ్రీహరి, పెనుగొండ రామకృష్ణ, బిక్కిన సాంబ, కప్పల వెలుగు, మజ్జి పద్మ, తంగేటి సాయి, జాలా మదన్‌, శెట్టి జగదీష్‌, విశ్వనాథరాజు, బిక్కిన రవికిషోర్‌, విక్రమ్‌సందీప్‌ చౌదరి, మళ్ళ వెంకట్రాజు, మేరపురెడ్డి రామకృష్ణ, కర్రి రాంబాబు, జాగు వెంకటరమణ, ఆవాల ఈశ్వర్‌, గణేష్‌ యాదవ్‌, గునపర్తి శివ, మునికోటి వెంకటేశ్వరరావు, కంచిపాటి గోవింద్‌, వంక శ్రీనివాస చౌదరి, తేతలి రాము, మధు వరప్రసాద్‌, కాట్రు లక్ష్మణస్వామి, తలారి భాస్కర్‌, జక్కంపూడి అర్జున్‌, మాకాని లక్ష్మణరావు, కరగాని వేణు,శీలం గోవింద్‌, పైలా రాంబాబు, గఫూర్‌, రెహ్మాన్‌, కొత్తూరి బాలనాగేశ్వరరావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here