బాలయ్య, చంద్రబాబులను అరెస్ట్‌ చేయాలి

0
277

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద భారతీయ జనతా ఓబీసీ మోర్చా ధర్నా

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 23 : ప్రధానమంత్రి నరేంద్రమోడీని దుర్భాషలతో నిందించిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను, ఆయనకు మద్దతునిచ్చిన సీఎం చంద్రబాబును తక్షణం అరెస్ట్‌ చేయాలని కోరుతూ భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఈరోజు ధర్నా నిర్వహించారు. ఓబీసీ మోర్చా అర్బన్‌ జిల్లా అధ్యక్షులు పిల్లి వెంకటరమణ తదితరుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిజెపి అర్బన్‌ జిల్లా అధ్యక్షులు బొమ్ములదత్తు, కార్పొరేటర్‌ రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొట్లూరి రామ్మోహనరావు, నగర ప్రధాన కార్యదర్శులు అడబాల రామకృష్ణ, బూర రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లి వెంకటరమణ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రధాని మోడీ అవినీతిరహితంగా జనరంజకమైన పరిపాలన అందిస్తున్నారని, అటువంటి వ్యక్తిపై ఈరోజు బాలకృష్ణ సమాజం సిగ్గుపడే విధంగా వ్యాఖ్యలు చేశారని, దీనిపై పోలీసు యంత్రాంగం స్పందించి ఆయనను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పడాల నాగరాజు, మునకాల గణేష్‌రెడ్డి, శింగంపల్లి కొండలరావు, వాసంశెట్టి వెంకట్రావు, రేలంగి నాగేశ్వరరావు, నిల్లా ప్రసాద్‌, రాయుడు వెంకటేశ్వరరావు, కాలెపు సత్యసాయిరామ్‌, యానాపు యేసు, రొంగలి గోపి శ్రీనివాస్‌, పసలపూడి శ్రీనివాస్‌, తంగెళ్ళ పద్మావతి, తంగెళ్ళ శ్రీనివాస్‌, నందివాడ సత్యనారాయణ, వీరా వీరాంజనేయరావు, కొప్పోజు తమ్మాజీ, పైలా సుబ్బారావు, కాండ్రేగుల భూలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here