బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్‌గా పద్మావతి

0
219

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 15 : ప్రముఖ న్యాయవాది, బాలల న్యాయ మండలి సభ్యురాలు బి. పద్మావతి తూర్పుగోదావరి జిల్లా బాలల సంక్షేమ సమితి చైర్‌ పర్సన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 18 ఏళ్లలోపు బాలలకు సంబంధించి రక్షణ, సంరక్షణ బాధ్యతలు ఈ సమితి చేపడుతుంది. మరో నలుగురు సభ్యులు న్యాయమూర్తులు, సమూహంగా ఈ సమితి కార్యనిర్వహణ ఉంటుంది. 1997లో న్యాయవాద వృత్తి ప్రారంభించిన పద్మావతి మాజీ కార్పొరేటర్‌ మెరపల శ్యామలరావు సతీమణి. తనదైన శైలిలో ప్రజలకు సేవలందిస్తూ వివిధ రంగాలలో సభ్యురాలిగా పనిచేశారు. జిల్లా ప్రభుత్వ న్యావాదిగా బాలల న్యాయమండలి సభ్యురాలిగా పలు స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించారు. కస్తూరిభా ఆశ్రమానికి అవసరమైన వాటిని వితరణ చేశారు. స్వచ్ఛంద సేవల ఆహ్వానం మేరకు బాలల హక్కులు, విద్యాచట్టం అంశాలపై జిల్లాలోని ఏజెన్సీతో పాటు అనేక ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా కిషోర్‌ వికాసం, అమ్మకు వందనం, వ్యక్తిత్వ వికాసం పై శిక్షణ ఇచ్చారు. ఉన్నత విద్యావంతురాలిగా ఉన్న పద్మావతి బాలల సంక్షేమ సమితికి మరింత ప్రేరణ కలిగిస్తూ.. సముచిత న్యాయం చేస్తారని అందరు భావిస్తున్నారు. బాలల సంక్షేమ సమితి జిల్లాలో విస్తృత ప్రచారాన్ని చేపట్టి, పోలీసులకు చైల్డ్‌ లైన్‌ స్వచ్ఛంద సంస్థల సహకారంతో పనిచేస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here