బాలాజీదాస్‌ ఆశయాల సాధనకు కృషి చేస్తాం

0
184
శతజయంతి సభలో నేతల నివాళులు
రాజమహేంద్రవరం,జులై 20 :  కార్మిక నేత జి.ఎస్‌.బాలాజీదాస్‌ ఆశయాలు సాధించేందుకు కృషిచేస్తామని శత జయంతోత్సవాల్లో సిపిఐ, సిపిఎం నాయకులు ప్రతిన బూనారు. స్థానిక శ్యామలా సెంటర్లో ఉన్న బాలాజీదాస్‌ విగ్రహానికి సిపిఎం, సిపిఐ నాయకులు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం సీనియర్‌ నాయకులు టిఎస్‌ ప్రకాష్‌, టి.అరుణ్‌, బాలాజీదాస్‌ కుమారుడు జిఎ భూషణ్‌బాబులు మాట్లాడుతూ బాలాజీదాస్‌ చేసిన సేవలను కొనియాడారు.  స్వాతంత్య్రపోరాటంలో బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన బాలాజీదాస్‌ కమ్యూనిష్టు పార్టీలో చేరి అనేక కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించారన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకుడిగా, రాజమండ్రి మున్సిపాలిటీకి వైస్‌ ఛైర్మన్‌గా సేవలందించారని, నగరంలోని వేలమంది ప్రజలకు ఇల్లు, ఇళ్ళ స్థలాలు కొరకు పోరాడి సాధించారని తెలిపారు. కార్మిక ఉద్యమాల్లో ఎందరో నాయకులకు స్ఫూర్తిప్రదాతగా నిలుస్తారన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ఆయన చేసిన పోరాటం ఆదర్శవంతంగా ఉంటుందన్నారు. చాంబర్‌ మాజీ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌ జైన్‌, సిపిఎం నాయకులు ఎస్‌.ఎస్‌.మూర్తి, నగర కార్యదర్శి పోలిన వెంకటేశ్వరరావు, సిఐటియు నగరప్రదాన కార్యదర్శి కె.ఎస్‌.వి.రామచంద్రరావు, బి.పూర్ణిమరాజు,బి.రాజులోవ,బి.పవన్‌, ఐ.సుబ్రహ్మణ్యం, మహంతి లక్ష్మణరావు, యడ్ల లక్ష్మి, జి.తాతారావు, బాబూరావు, జి.భాస్కర్‌, కుటుంబ సభ్యులు జి.శరత్‌బాబు, అజయ్‌ సుబ్రహ్మణ్యం, గౌతమీ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here