బాలికలదే హవా

0
138
ఇంటర్‌ ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 60 శాతం
ద్వితీయ సంవత్సరంలో 72 శాతం ఉత్తీర్ణత
ఫలితాల్లో క ష్ణా జిల్లా టాప్‌-
అమరావతి,ఏప్రిల్‌ 12 : ఏపీలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఫలితాలను ఈ ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. తొలిసారిగా గ్రేడింగ్‌ విధానంలో ఈ ఫలితాలను వెల్లడించారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 60 శాతం, ద్వితీయ సంవత్సరంలో 72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంతో పోలిస్తే ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైంది. అటు ప్రథమ, ఇటు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో క ష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సర ఫలితాల్లో జనరల్‌లో మొత్తం 60 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యింది. వొకేషనల్‌లో 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. క ష్ణా (72), పశ్చిమ గోదావరి (69), నెల్లూరు (67) జిల్లాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. జనరల్‌లో బాలికలు 64 శాతం, బాలురు 56 ఉత్తీర్ణత సాధించారు.  ద్వితీయ సంవత్సర ఫలితాల్లో.. జనరల్‌లో 72 శాతం ఉత్తీర్ణత నమోదు అవ్వగా.. వొకేషనల్‌లో 69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. క ష్ణా (81), చిత్తూరు (76), నెల్లూరు, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలు 74 శాతం ఉత్తీర్ణత శాతాలతో తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. బాలికలు 75, బాలురు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు.
24 రోజుల్లోనే ఫలితాలు..
ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 27న మొదలై 18తో ముగిశాయి. కేవలం 24 రోజుల్లోనే ఫలితాలు విడుదలవ్వడం విశేషం. మొత్తం 10.17 లక్షల మంది విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోగా.. 9.65 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఉదయలక్ష్మి తెలిపారు. వీరిలో 6.3 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణలు కాగా.. 3.3 లక్షల మంది ఫెయిలయ్యారు. మే 14 నుంచి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రుసుము చెల్లించేందుకు ఈ నెల 24 ను తుది గడువుగా నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here