బాల సదనంలో ఫ్లోర్‌ మరమ్మతు పనులను ప్రారంభించిన గన్ని 

0
340
రాజమహేంద్రవరం, ఆగస్టు 10 : నగరంలోని దానవాయిపేటలో కందుకూరి రాజ్యలక్ష్మీ మహిళా కళాశాల వద్ద ఉన్న బాలసదనంలో ఫ్లోర్‌ మరమ్మత్తు పనులను గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ ఈరోజు ప్రారంభించారు.అనాథ పిల్లలు ఉండే ఈ సదనంలో ఫ్లోర్‌ మరమ్మత్తులకు ఆదరణ స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో తలారి వరప్రసాదరావు స్మారకంగా వారి సతీమణి మణి, కుమారుడు విజయ్‌ తేజ్‌ ముందుకు వచ్చి పూర్తి చేయించారు. ఈ సందర్భంగా  బాలసదనంలోని సమస్యలను గన్ని కృష్ణ దృష్టికి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాధా కృష్ణంరాజు, రాచపల్లి ప్రసాద్‌లు తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి పూర్తి వివరాలను, అవసరాలను తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌,  పాస్టర్‌ వి. జాఫకువా, రాయల అనంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ గన్ని కృష్ణ మొక్కలను నాటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here