బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల ఒకరోజు సమ్మె 

0
330
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 15 : బిఎస్‌ఎన్‌ఎల్‌ యాజమాన్యంలోని 65 వేల టవర్స్‌ నిర్వహణకు ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిఎస్‌ఎన్‌ఎల్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎగ్జిక్యూటివ్‌ యూనియన్లు ఎన్‌ఎఫ్‌టిఇ-బిఎస్‌ఎన్‌ఎల్‌ యూనియన్‌ సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుతం కేవలం ఆరు వేల టవర్స్‌ లీజ్‌కి ఇవ్వడం ద్వారానే సుమారు రూ. 200 కోట్ల ఆదాయం వస్తుందని, ఇంకా మిగిలిన టవర్స్‌లో 50 నుంచి 60 శాతం టవర్స్‌ లీజ్‌కి ఇస్తే ఈ ఆదాయం రూ. 2 వేల కోట్లు వరకు పెరిగే అవకాశం ఉన్నప్పటికి ప్రభుత్వం ప్రత్యేక టవర్ల కంపెనీకే మొగ్గు చూపడం కేవలం ప్రైవేట్‌ పరం చేయడానికేనని ఎన్‌ఎఫ్‌టిఇ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎన్‌ రాజ్‌కుమార్‌ ఆరోపించారు. బిఎస్‌ఎన్‌ఎల్‌  ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి బయటపడుతున్న పరిస్థితుల్లో టవర్ల వాడకం ఛార్జీలను చెల్లించాలంటే  మరింత నష్టాల పాలు కాగలదనే ఆందోళనలో ఉద్యోగులున్నారని అన్నారు. అందుకే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఉన్న బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగులు ఈరోజు సమ్మెలో పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు  జి.సత్యనారాయణ, కార్యదర్శి ఎస్‌ఎస్‌ రాజ్‌కుమార్‌, కోశాధికారి కె.త్రిమూర్తులు, సహాయ జిల్లా కార్యదర్శులు మహబూబ్‌ ఆలీ, ఆర్‌.సాయిబాబా, కె.శ్రీనివాసరావు, లోకల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ బి.ప్రభాకరరావు, వెల్ఫేర్‌ బోర్డు మెంబర్లు బి.పరదేశిబాబు, ఎన్‌.డేవిడ్‌రాజు, ఎం.షరీఫ్‌, బ్రాంచి కార్యదర్శులు టి.వెంకట్రావ్‌, సిహెచ్‌. రాంబాబు, జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.