బిజెపి ఆధ్వర్యంలో దీనదయాళోపాధ్యాయ జయంతి  

0
302

రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 26 : భారతీయ జనతా పార్టీ మాతృ సంస్ధ జనసంఘ్‌ వ్యవస్థాపకుల్లో ఒక్కరైన పండిట్‌ దీనదయాళోపాధ్యాయ శత జయంతి గోకవరం బస్టాండ్‌ వద్ద  ఉన్న బిజెపి అర్బన్‌ జిల్లా ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దీనదయాళోపాధ్యాయ చిత్రపటానికి బిజెపి నగర అధ్యక్షులు బొమ్ముల దత్తు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర అనంతరం నెహ్రూ సోషలిజంతో, వామపక్షాలు కమ్యూనిజంతో  దేశ ప్రజలను విభజించిన సందర్భంలో దీనదయాళ్‌ దేశానికి భిన్నత్వంలో ఏకత్వం అన్న భావనతో ఏకాత్మతా మానవతావాదం’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి   అప్పటి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులను సంప్రదించి జనసంఘ్‌ పార్టీని స్ధాపించారన్నారు.  దేశ సమగ్రత, సౌభ్రాతృత్వమే ప్రధాన లక్ష్యంగా పనిచేసి నేడు నరేంద్రమోడీ వంటి ఉన్నతమైన ప్రధాని దేశాన్ని పరిపాలించడానికి ఆద్యులయ్యారని అన్నారు. వారి ఆశయాలు ప్రతి కార్యకర్తకు మార్గదర్శకం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు పొట్లూరి రామ్మోహనరావు, రేలంగి శ్రీదేవి,  ప్రధాన కార్యదర్శి అడబాల రామకృష్ణ, యెనుముల రంగబాబు, ఎన్‌ఎన్‌ఎస్‌ చంద్రశేఖర్‌, మీడియా సెల్‌ ఇన్‌ఛార్జి దాస్యం ప్రసాద్‌, బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు  కెవిఎం కృష్ణలతో పాటు పైలా సుబ్బారావు,యెనుముల రంగబాబు, వెత్సా రాంప్రసాద్‌, బేతిరెడ్డి ఆదిత్య, కుంజం వంశీ, ప్రవీణ్‌, పిల్లి వెంకటరమణ, పిల్లి మణెమ్మ, మచ్చ పరశురాం, కమ్మ వంశీ, కొండపల్లి అజయ్‌, బోరపల్లి రామకృష్ణ, మడగల మూర్తి, అజుదారావు, గోపి శ్రీను, రాయుడు వెంకటేశ్వరరావు, తంగెళ్ళ శ్రీనివాస్‌, కొర్ని కిషోర్‌ యాదవ్‌, బొమ్ముల చందు, వై.శ్రీనివాస్‌, కందికొండ రమేష్‌,  బూర రామచంద్రరావు, బస్సా లక్ష్మీనారాయణ, నందివాడ సత్యనారాయణ, కంచర్ల సాయి, కమలేష్‌ జైన్‌, అడపా వరప్రసాద్‌ పాల్గొన్నారు.