బిజెపి నయవంచనపై చంద్రబాబు ధర్మ పోరాటం

0
177
29న కాకినాడకు భారీ ఎత్తున తరలి రావాలని తెదేపా నేతల పిలుపు
రాజమహేంద్రవరం, జూన్‌ 24 : విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాల్సిన బిజెపి ప్రభుత్వం తెలుగు ప్రజలను వంచించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మోడీ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారని, అందులో భాగంగానే ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, మంతెన సత్యనారాయణరాజు అన్నారు. ఈనెల 29న కాకినాడలో సీఎం చంద్రబాబు చేపట్టే ధర్మ పోరాట దీక్ష కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ సమావేశాన్ని హోటల్‌ జగదీశ్వరిలో నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గన్ని, ఆదిరెడ్డి, మంతెన మాట్లాడుతూ ఎన్నికల్లో ఎన్నో హామీలు గుప్పించి ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని, ఢిల్లీని తలదన్నేలా రాజధానిని నిర్మిస్తామని, పోలవరాన్ని పూర్తి చేస్తామని, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు మంజూరు చేస్తామని, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, విశాఖ రైల్వేజోన్‌ ప్రకటిస్తామని ఎన్నో హామీలు ఇచ్చిన బిజెపితో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని, అయితే  అధికారంలోకి వచ్చాక ఏపీని రోజురోజూకీ వంచించారని, అందువల్లే ఎన్‌డిఏ నుంచి బయటకు వచ్చి ధర్మ పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం సహకారం లేకపోయినా ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని కొనసాగిస్తున్న చంద్రబాబు కృషిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతిపక్షాల అర్థరహిత విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈనెల 29న కాకినాడలో సీఎం చంద్రబాబు చేపట్టే ధర్మ పోరాట దీక్షకు సిటీ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, ఆదిరెడ్డి వాసు, కార్పొరేటర్లు మాటూరి రంగారావు, యిన్నమూరి రాంబాబు, కడలి రామకృష్ణ, కోరుమిల్లి విజయశేఖర్‌, కోసూరి చండీప్రియ, రెడ్డి పార్వతి, తలారి ఉమాదేవి, కొమ్మ శ్రీనివాస్‌, బెజవాడ రాజ్‌కుమార్‌, మర్రి దుర్గా శ్రీనివాస్‌, కో-ఆప్షన్‌ సభ్యులు చాన్‌ భాషా, పార్టీ నాయకులు అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌, మరుకుర్తి రవి యాదవ్‌, బెజవాడ వెంకటస్వామి, విశ్వనాథరాజు, రామినేని మస్తాన్‌ చౌదరి, మళ్ళ వెంకట్రాజు, బొమ్మనమైన శ్రీనివాస్‌, సూరంపూడి శ్రీహరి, పోలాకి పరమేష్‌, జాగు వెంకటరమణ, కర్రి రాంబాబు, మానే దొరబాబు, మొల్లి చిన్నియాదవ్‌,  కేబుల్‌ సుధ, మిస్కా జోగినాయుడు, నల్లం ఆనంద్‌కుమార్‌, పుట్టా సాయిబాబు, జాలా మదన్‌, కంచిపాటి గోవింద్‌, మునుకోటి వెంకటేశ్వరరావు, తంగేటి సాయి, మేరపురెడ్డి రామకృష్ణ, కవులూరి వెంకట్రావు, కాట్రు రమణకుమారి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here