బినామీ నిందితులు

0
208
మనస్సాక్షి  – 1159
శాంతమ్మ.. పేరుకి తగ్గట్టుగానే శాంతమూర్తి. ఎవరినీ ఎప్పుడూ పల్లెత్తుమాట అనదు. అంద రితో మంచిగానే ఉంటుంది. మడీ ఆచారా లతో దేవుడికి పూజా పునస్కారాలు చేసు కోవడం, యింకా యింట్లో భర్తకీ, పిల్లలకీ శుభ్రంగా వండిపెట్టుకోవడం..యిదే ఆమె ప్రపంచం., ఆమె జీవితం కూడా. ఓ రకంగా బయట ప్రపంచంతో ఆమెకు సంబంధాలూ తక్కువే.   అలాంటి శాంతమ్మ పేరు ఒక్కసారిగా రాష్ట్రమంతా మార్మోగిపోయింది. సదరు శాంతమ్మని అరెస్టు చేయాలన్న ధర్నాలూ జరిగాయి. అంతేకాదు. ఆరోజు ఉదయాన్నే జీపునిండా పోలీసులొచ్చి శాంతమ్మని అరెస్టు చేసి పట్టుకెళ్ళి జైల్లో పడేశారు. యింతకీ ఆ శాంతమ్మ ఎవరో కాదు. వెంకటేశం  తల్లి..! అసలు దీనంతటికీ బీజం పడింది సంవత్సరం కిందటే..
——-
”గురూగారూ.. దూకేద్దామనుకుంటున్నా” అన్నాడు వెంకటేశం వస్తూనే. ఆపాటికి చుట్ట గుప్పుగుప్పుమనిపిస్తూ ఆనందం పొందుతున్న గిరీశం కంగారుపడి ”అదేంపనోయ్‌.. యింకా నీకు ముప్పై ఏళ్ళే కదా. పెళ్ళి కుదురుతుందిలే” అన్నాడు. దాంతో వెంకటేశం  విసుక్కుని ”బురద జోకులెయ్యకండి గురూగారూ.. నేనంటుంది వ్యాపారంలోకి దూకేస్తానని” అన్నాడు. దాంతో గిరీశం ”యింకేం.. బ్రహ్మాండంగా ఉంటుంది” అన్నాడు. యింతలో వెంకటేశం ”అయితే నేనందరిలా వెళదామను కోడంలేదు. ఏం చేయాలంటారు?” అన్నాడు. గిరీశం తలూపి ”నీ ఆలోచన నాకర్థమయింది. యింతకీ ఏ వ్యాపారం చేద్దావని?” అన్నాడు. వెంకటేశం ”ఫుడ్స్‌ బిజినెస్‌ పెడదామనుకుంటున్నా గురూగారూ.. శాంతోమ్స్‌ ఫుడ్స్‌ అని పేరు పెడదామని” అన్నాడు. గిరీశం అర్థ:కానట్టు ”శాంతోమ్‌ ఫుడ్సా?” అన్నాడు. దాంతో వెంకటేశం నవ్వేసి ”మా అమ్మ శాంతమ్మ పేరుతో గురూగారూ.. మరీ శాంతమ్మ ఫుడ్స్‌ అయితే పాత చింతకాయ పచ్చడిలా ఉంటుందని” అన్నాడు. దాంతో గిరీశం నవ్వేసి ”యిదేదో ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి చేత పాప్‌గీతాలు పాడించినట్టుందోయ్‌.. అయినా యిప్పటి ట్రెండ్‌కి అలాంటి పేరే ఉండాలిలే. యింకో విషయం గుర్తుపెట్టుకో. చేసే వ్యాపారం ఏదో యిప్పటి ట్రెండ్‌కి అను గుణంగా ఉండాలి. కమర్షియల్‌గానూ ఉండాలి. అలాగని సేవా దృక్పథాన్ని వదలనూకూడదు. అప్పుడే పబ్లిక్‌లో మంచి పేరు తెచ్చుకోవచ్చు. వచ్చే ఎలక్షన్స్‌లో నీకది ఎంతో ఉపయోగపడు తుంది” అన్నాడు. వెంకటేశం తలూపాడు. యింకో వారం తర్వాత ”శాంతోమ్‌ ఫుడ్స్‌’ ప్రారంభమయింది. కొన్నిరోజులపాటు ఏదో చిన్న స్థాయి వ్యాపారం జరిగింది. యింతలో స్కూలు పిల్లల మధ్యాహ్న భోజనానికి సంబంధించిన కాంట్రాక్ట్‌ రావడంతో ఆ సంస్థ పేరు మార్మోగిపోయింది. అంతకుముందు ఇస్కాన్‌లాంటి సంస్థలేవో ఆ కాంట్రాక్టులేవో బాగా నడిపాయిగానీ వాళ్ళు గుడ్డులాంటివి పెట్టడం లేదన్న విమర్శలు రావడంతో వాళ్ళని తప్పించడం జరిగింది. నిజంగా వాళ్ళు చాలా మంచి భోజనమే పెట్టేవాళ్ళు. యిప్పుడా కాంట్రాక్ట్‌ వెంకటేశం పెట్టిన ‘శాంతోమ్‌ ఫుడ్స్‌’కి దక్కింది. వెంకటేశం కూడా ప్రభుత్వం నిర్ణయించిన దానికే ఆ భోజనం పెట్టడానికి ఒప్పుకున్నాడు. అంతేకాదు. ప్రభుత్వం యిచ్చేది నామ మాత్రమైనా వెంకటేశం ఏమాత్రం లాభాపేక్ష లేకుండా మంచి భోజనం పెడుతున్నాడు.. అదీ జిల్లాలోని ఎన్నో స్కూల్స్‌లో చదువు కునే వేలాదిమందికి. దాంతో ‘శాంతోమ్‌ ఫుడ్స్‌’కి చాలా మంచి పేరొచ్చింది. యిలా దాదాపు ఓ సంవత్సరంపాటు గడిచింది. ఆరోజో సంఘటన జరిగింది. ఆరోజు మధ్యాహ్నం భోజనాలు అయిం తర్వాత అది తిన్న పిల్లల్లో వందలాదిమంది పిల్లలు ఒక్కసారిగా అస్వస్థతకి గురయ్యారు. కొంతమందికి వాంతులయితే యింకొం దరికి స్పృహపోయింది. దాంతో వేర్వేరు స్కూల్స్‌లోని ఆ పిల్లలంద రినీ అందుబాటులో ఉన్న హాస్పిటల్స్‌కి తరలించేశారు. ఈలోగా మీడియావాళ్ళు విషయం తెలుసుకోడానికి వెంకటేశం దగ్గర కొచ్చేశారు. అప్పటికే జరిగిందాంతో షాక్‌లో ఉన్న వెంకటేశం ”అసలు యిదెలా జరిగిందో అర్థంకావడంలేదు. మేము రోజూ లాగే అన్నం, కూరలూ శుభ్రంగా వండించి పదివేనుల్లో జిల్లాలో వేర్వేరు స్కూళ్ళకి పంపించడం జరిగింది. ఏవయిందో తెలుసు కుంటా” అన్నాడు. ఈలోగా హాస్పిటల్లో చేర్పించిన వెయ్యిమందిలో ఆరొందల మంది పిల్లల్ని వెంటనే యిళ్ళకి  పంపిం చెయ్యడం జరిగింది. యింకో నాలుగు వందలమందికి సెలాయిన్స్‌ పెట్టారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందన్న  వార్తలూ వచ్చాయి. దాంతో అంతా గగ్గోలు మొదలయింది. మీడియాలో వస్తున్న వార్తలతో పరిస్థితులు యింకా బిగుసు కోవడం మొదలెట్టాయి. దాంతో ఎందు కయినా మంచిదని వెంకటేశం ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేసి రాజవొమ్మంగి అవతల ఉండే తన ఫ్రెండ్‌ నూకరత్నం దగ్గరికిపోయాడు. అక్కడ జరిగిందంతా చెప్పి బావురు మన్నాడు. దాంతో నూకరత్నం ”నువ్విక్కడే ఉండు. యిక్కడ టీవీలూ, ఫోన్‌లూ పనిచేయవు. వాటి కోసం ఓ అర కిలోమీటరు వెళ్ళాల్సిందే. నేను ఎప్పటికప్పుడు వెళ్ళి అన్నీ కనుక్కుని వస్తుంటా” అన్నాడు. వెంకటేశానికి యిదేదో బావుందనిపించింది. నూకరత్నం అలాగే వెళ్ళి ఆప్‌డేట్స్‌ పట్టుకొస్తున్నాడు. యింకో రెండ్రోజుల తర్వాత వెంకటేశం తన లాయర్‌ని అక్కడికి రప్పించుకున్నాడు. అయితే లాయర్‌ ”యిదిగో వెంకన్నబాబూ.. నువ్విలా దాక్కోవడం సరయింది కాదు. దాంతో కేసు యింకా బిగుసుకుపోతుంది. నువ్వే ఎదురెళ్ళి సరెండరయిపోతే మంచిది” అన్నాడు. వెంకటేశానికి కూడా యిదేదో నిజమనిపించింది. ఈలోగా పిల్లలు తిన్న అన్నంలో పాములాంటి విష జంతువేదో పడిందన్న రిపోర్టు కూడా అన్నంలో పాములాంటి విష జంతువేదో పడిందన్న రిపోర్టు కూడా వచ్చింది. మర్నాడు లాయరు సాయంతో వెంకటేశం వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. యింతలో యింకో విశేషం జరిగింది. అదే సమ యంలో ‘శాంతోమ్‌ ఫుడ్స్‌’లో యింకో పార్టనరయిన శాంతమ్మని పోలీసులు అరెస్టు చేశారు.
——-
శాంతమ్మకయితే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. పొద్దున్నే తను రోజులా తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే యింటి ముందు పోలీసు జీపొచ్చి ఆగింది. అందులోంచి బిలబిలమంటూ మహిళా కానిస్టేబుల్స్‌ దిగి తనని జీపెక్కించుకుని తీసుకు పోయారు. శాంతమ్మ ఎలాగో గొంతు పెగల్చుకుని ”నన్నెక్కడికి తీసుకెడు తున్నారు?” అనడిగితే ఎస్సై ”మరి వందలమంది ప్రాణా లతో ఆడు కుంటే ఊరుకుంటారా” అని మాత్రం అంది. తర్వాత శాంతమ్మకి కోర్టు పధ్నాలుగురోజుల రిమాండ్‌ విధించడం జరిగింది. యిక ఆ జైలు వాతావరణంలో శాంతమ్మయితే యిమడలేక విలవిల్లాడి పోతోంది. ఉదయాన్నే మడికట్టుకుని ఆ దేవుడికి నైవేద్యం వండి పెట్టనిదే తను మంచినీళ్ళయినా ముట్టదు. అలాంటిది అక్కడ ఎవరెవరో వండిందేదో సత్తుగిన్నెలోపెడుతున్నారాయె. ఆ పరిస్థితి తట్టు కోలేక శాంతమ్మ కళ్ళు తిరిగిపడిపోయింది.
——–
”అమ్మో..అలా జరగడానికి వీల్లేదు” అంటూ వెంకటేశం కంగారుగా లేచి కూర్చున్నాడు. మొహమంతా చెమటలు పడుతున్నాయి. అప్పుడే వచ్చిన గిరీశం ”ఏవివాయ్‌.. పీడకల ఏవయినా వచ్చిందా?” అన్నాడు. వెంకటేశం ఆ చెమటలు తుడుచుకుంటూ తనకొచ్చిన  కలంతా చెప్పాడు. అంతా విని గిరీశం ”అవునోయ్‌.. మొన్న లాంచీ ప్రమాదం తర్వాత ఆ లాంచీ యజమానులంటూ ఓ ముగ్గురిని అరెస్టు చేశారు కదా. అందులో ఓ యిద్దరు స్త్రీలు కూడా ఉన్నారు. అదేదో నీ కలలోకి దూరినట్టుంది” అన్నాడు. వెంకటేశం తలూపి ”అవును. నిజమే గురూ గారూ.. అయినా యిందులో తప్పుపట్టడానికేముంది? అంత దారుణం జరిగింతర్వాత ఆ లాంచీ యజమానులు బాధ్యులే కదా” అన్నాడు. గిరీశం తలూపి ”అవునోయ్‌.. చట్టపరంగా చూస్తే బాధ్యులే. అయితే మనం దీన్ని యింకో కోణంలో విశ్లేషిద్దాం. ఏదైనా అరెస్టయిన వారికి సామాన్యంగా జరిగిందాంట్లో సంబంధం ఉండదు. ఆ నిర్వహణంతా చూసేది వేరేవాళ్ళు. అయితే ఆ నిర్వహణా లోపం వలన జరిగిం దాంతో అమాయకులయిన బినామీ స్త్రీలు అరెస్టయి బాఢపడు తుంటారు. యిలాంటివి చాలా కేసుల్లో చూస్తుంటాం. యిది బాధా కరమే. అలాగని యిలాంటి ప్రమాదాల తర్వాత యజమానుల్ని వదిలేసి నిర్వా హకుల్ని శిక్షిస్తే అన్ని కేసుల్లో యజమానులు తప్పించుకునే  అవకాశం ఉంది. అదీ సరికాదు. అందుకే యిలాంటి రిస్కీ వ్యాపా రాల్లో ఆర్థిక పరమయిన అంశాల కారణంగానో, ప్రేమగానో, తల్లి పేరునో, భార్య పేరునో బినామీగా ఆ బిజినెస్‌లు పెట్టడం సరికాదు” అంటూ తేల్చాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here