బినామీ వర్కర్ల వ్యవస్థను రద్దు చేయాలి

0
262
బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద ఉద్యోగుల ధర్నా
రాజమహేంద్రవరం, జులై 10 : బిఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు, క్యాజువల్‌ వర్కర్ల తొలగింపును నిరసిస్తూ స్థానిక కోటగుమ్మం వద్దనున్న బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆర్థిక పరిస్థితి బాగా లేదనే సాకుతో వివిధ సర్కిళ్లలో బినామీ వర్కర్లను తొలగిస్తున్నారని బిఎస్‌ఎన్‌ఎల్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ క్యాజువల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ తూర్పు గోదావరి జిల్లా శాఖ గౌరవ అధ్యక్షుడు పి.మహేశ్వరరావు ఆరదోళన వ్యక్తం చేసారు. స్థానిక కోటగుమ్మం వద్ద ఈరోజు ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తొలగించిన కాంట్రాక్టు వర్కర్లను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని, రిటైర్మెంట్‌ చేయకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేసారు. కాంట్రాక్టు వర్కర్లుగా నమోదుకాని బినామీ వర్కర్లను కాంట్రాక్టు వర్కర్లుగా నమోదు చేసి బినామీ వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనంగా రూ 18 వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు, క్యాజువల్‌ వర్కర్లకు కూడా కనీస వేతనాన్ని అమలు చేయాలని, వర్కర్లకు గుర్తింపు కార్డులు, ఎంప్లాయ్‌మెంట్‌ కార్డులు, ప్లే సిప్పులు ఇవ్వాలని, ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ, వర్క్‌మెన్‌ కాంపన్సేషన్‌, సామాజిక భద్రతా చట్టాలను, పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేసారు. ఈ సందర్భంగా బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, కాంట్రాక్టు, క్యాజువల్‌ వర్కర్ల ఫెడరేషన్‌ వర్థిల్లాలని, బినామీ వర్కర్ల తొలగింపును వ్యతిరేకిస్తాం.. బినామీ వర్కర్ల వ్యవస్థను రద్దు చేయాలి వంటి నినాదాలు చేసారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పి.ధర్మారావు, జిల్లా కార్యదర్శి రెడ్డి రాము, జిల్లా ఉపాధ్యక్షుడు గుత్తుల ప్రసాద్‌, జిల్లా కోశాధికారి ఎం.వెంకట ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here