బిసి యువజన విభాగం జిల్లా అధ్యక్షునిగా దాస్యం ప్రసాద్‌

0
259

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 21 : జిల్లా బిసి సంక్షేమ సంఘం యువజన విభాగం అధ్యక్షునిగా దాస్యం ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈరోజు ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కుమార్‌ చేతుల మీదుగా ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేశన శంకరరావు మాట్లాడుతూ సంఘంలో యువజన విభాగం కీలకమైందని, సంఘం నిర్ణయించే ఉద్యమాలను, పోరాటాలను నడిపించే బాధ్యత వారిపై ఉంటుందన్నారు. సంఘ పటిష్టతకు, బిసిల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని, రానున్న ఎన్నికల్లో బిసి సంఘాన్ని బలమైన శక్తిగా తయారు చేయాలని అందుకు యువత దృఢ దీక్షతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ జెఎసి చైర్మన్‌ మార్గాని నాగేశ్వరరావు, రాష్ట్ర కో ఆర్డినేటర్‌ మార్గాని రామకృష్ణ గౌడ్‌, పొడుగు శ్రీను, మజ్జి అప్పారావు, శీర లక్ష్మీ, గోలి రవి, మీసాల గోవిందరావు, సుభాషిణి, వినయకుమారి, నందం స్వామి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here