బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా రేపు లద్దిక మల్లేష్‌ ప్రమాణం

0
161
హాజరుకానున్న ఆర్‌.కృష్ణయ్య, నారాయణమూర్తి
రాజమహేంద్రవరం,నవంబర్‌ 26 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బిసి విద్యార్ధి విభాగం అధ్యక్షుడిగా లద్దిక మల్లేష్‌ రేపు ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు హోటల్‌ ఆనంద్‌ రీజెన్సీ ఫంక్షన్‌ హాల్లో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య, అధ్యక్షుడు లాకా వెంగళరావు, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ కారెం శివాజీ, సినీ నటులు ఆర్‌.నారాయణమూర్తి తదితరుల సమక్షంలో మల్లేష్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా లద్దిక మల్లేష్‌ మాట్లాడుతూ హోటల్‌ సితారలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో మల్లేష్‌ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతను నిర్వర్తించి సంఘ బలోపేతానికి కృషి చేస్తానని, విద్యార్ధుల సమస్యల పరిష్కారానికి ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులను ఆహ్వానించామన్నారు. ఉదయం 9:30 గంటలకు వై-జంక్షన్‌లో ఉన్న సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహానికి కృష్ణయ్య పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీగా పందిరి ఫంక్షన్‌ హాల్‌కి చేరుకుంటామని అన్నారు. గత నలభై సంవత్సరాలుగా బిసి హక్కుల కోసం పోరాడుతున్న ఆర్‌.కృష్ణయ్య నేతృత్వంలో తాము పయనిస్తామని అన్నారు. బిసి మహిళా విభాగం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు బర్ల సీతారత్నం, జిల్లా అధ్యక్షురాలు మజ్జి సత్యవేణి, బిసి నాయకులు దాలిపర్తి వేమన, సూరంపూడి శ్రీహరి మాట్లాడుతూ రేపు జరిగే బిసి విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి తరలి రావాలని, ఆర్‌.కృష్ణయ్య సారధ్యంలో సంఘాన్ని మరింత బలపరుస్తామని అన్నారు.ఈ సమావేశంలో మహిళా విభాగం కార్యదర్శి సువ్వాడ ఉమాదేవి,ప్రచార కార్యదర్శి కొంచాడ అరుణ్‌కుమారి, పేరూరి సత్యనారాయణ, బూర హనుమంతరావు, చెన్నూరి విష్ణు, కర్రి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here