బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

0
241
రాజమహేంద్రవరం, జనవరి 2 : స్థానిక కోటిపల్లి బస్టాండ్‌ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్‌ వసతి గృహంలో నూతన సంవత్సర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ బి.సి. విద్యార్ధి ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు లద్దిక మల్లేష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను సూర్యప్రకాశరావు కట్‌ చేసి విద్యార్ధులకు పంచారు. ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్ధులు అందిపుచ్చుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకులు గంగుల సూర్యారావు, కె.కె.సంజీవరావు, మజ్జి అప్పారావు, ఆర్‌.వి.ప్రసాదరావు, పి.వి.ఎస్‌.కృష్ణారావు, ఎం.డి.ఆరిఫ్‌, ఎం.డి.మున్నా, దాలిపర్తి వేమన, బర్ల సీతారత్నం, పొడుగు శ్రీను, హాస్టల్‌ అధికారులు, విద్యార్ధులు పాల్గొన్నారు.