బిసి సంఘాన్ని పటిష్టపర్చాలి: కేశన శంకరరావు

0
237
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  22: బిసీల సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరిని చైతన్యపర్చి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంఘాన్ని పటిష్టపర్చాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు పిలుపు ఇచ్చారు. స్దానిక ఆనం రోటరీ హాలులో ఈరోజు అర్బన్‌ జిల్లా బిసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మజ్జి అప్పారావు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న కేశన శంకరరావు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో దుర్గాయాదవ్‌, మార్గాని రామకృష్ణగౌడ్‌, పిల్లి నిర్మల, గంగుల సూర్యారావు, కన్నారావు, బి.వెంకటేశ్వరరావు, మున్నా పాల్గొన్నారు.