బిసీలకు మేలు చేస్తున్న జగన్‌

0
95
రాజమహేంద్రవరం,నవంబర్‌ 7 : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాలనీలో బీసీలకు మేలు చేస్తున్నారని  జాతీయ బీసీ సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఎడి కామాచార్యులు అభినందనలు తెలిపారు. ఐదు నెలల పాలనలో బీసీలకు మంత్రి పదవులతోపాటు బీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించడమే కాకుండా బీసీల కోసం 50 శాతం రిజర్వేషన్లు బీసీ మహిళలకు సముచిత స్థానం కల్పించి బీసీల ఆశాజ్యోతిగా గుర్తింపుతెచ్చుకున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు నిర్ధిష్టంగా అమలు చేయాలన్నారు. బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు పూర్తిగా అమలు చేయాలన్నారు. బీసీ కమిషన్‌ను పూర్తిస్థాయిలో స్వతంత్రప్రతిపత్తితో నడిచేలా కృషి చేయాలన్నారు. బీసీ రుణాల కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పథకాలు బీసీలకు అందించేలా బీసీలకు వివిధ కార్పొరేషన్లను, నామినెటేడ్‌ పోస్టులను బీసీలకు పదవులు అందించాలని కోరారు. నామినెటేడ్‌ పదవుల్లో వెంటనే నియమాకాలు జరపాలన్నారు. బీసీ రుణాలు నేరుగా ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కోన సత్యనారాయణ, సెక్రటరీ వాసాబత్తుల శ్రీనివాసరావు, ఎబిసి శేఖర్‌, మేడిశెట్టి చిరంజీవి, ఆముదాలపల్లి కామేష్‌, ఎ.సుబ్రహ్మణ్యం, అంగళకుదిటి రామకృష్ణ, ధవిళేశ్వరపు వీరభద్రాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here