బీమా రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పిగొట్టాలి 

0
206
ఉద్యోగ సంఘ రజతోత్సవ సభలో వక్తలు పిలుపు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 28 : భారత ఆర్ధిక వ్యవస్ధకు వెన్నుదన్నుగా ఉన్న ప్రభుత్వ రంగ బీమా రంగాన్ని నిర్వీర్యం చేయాలనుకొనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను బీమా ఉద్యోగులు సంఘటితంగా ఎదుర్కోవాలని సంఘ నేతలు పిలుపునిచ్చారు. బీమా సంస్ధ ఉద్యోగుల సంఘం (ఐసిఇయు) రాజమండ్రి డివిజన్‌ (ఉభకఅయ గోదావరి జిల్లాలు ) రజతోత్సవ మహాసభ నిన్న  స్ధానిక ఎస్‌వి ఫంక్షన్‌ హాలులో ఘనంగా జరిగింది. సంఘం అధ్యక్షులు ఎంఎఎఫ్‌ బెనర్జీ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభను అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు కె వేణుగోపాల్‌ ప్రారంభించించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మిచాలని కోరారు. ప్రస్తుతం దేశంలో నిరుంకుశ పాలన సాగుతుందని, సామాన్య, మధ్యతరగతి  ఉద్యోగులకు వ్యతిరేకంగా అనేక విధానాల రూపకల్పన జరుగుతుందన్నారు. చైతన్యం కలిగిన సోరద ఉద్యోగ సంఘాలను కలుపుకుని ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. మరో ముఖ్య అతిధి అఖిల భారతీయ బీమా ఉద్యోగుల సంఘం పూర్వపు అధ్యక్షులు ఎన్‌ఎం సుందరం మాట్లాడుతూ దేశంలో పెచ్చుమీరుతున్న కులం, మతం ప్రాధాన్యాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కులమత ప్రాధాన్యాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు విద్యావంతులు, ఉద్యోగులు కృషిచేయాలన్నారు. పెద్దనోట్లు రద్దువల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య మరింత తీవ్ర సంక్షేమాన్ని సృష్టించకముందే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు. కులవివక్ష పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు ప్రసంగిస్తూ కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలను సంఘితం చేసే దిశలో ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం పాత్ర ఆచరణనీయమైనదన్నారు. ప్రజా ఉద్యమాలకు అఖిల భారతీయ బీమా ఉద్యోగుల సంఘం దేశవ్యాప్తంగా ఘననీయమైన సేవలందిస్తుందన్నారు. సౌత్‌సెంట్రల్‌ జోన్‌ అధ్యక్షులు కె వేణుగోపాలరావు ప్రసంగిస్తూ రాజమండ్రి డివిజన్‌ రజతోత్సవాల సందర్బంగా సంఘ కార్యకలాపాల కోసం త్వరలోనే భవన నిర్మాణం చేయాలని ఆకాంక్షించారు. చురుకైన నాయకత్వంలో రాజమండ్రి ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం దేశంలోనే అగ్రగామిగా ఉందని జోనల్‌ సహాయ కార్యదర్శి జి కిషోర్‌కుమార్‌ ప్రస్తుతించారు. ఈ రజతోత్సవ సభలో ఎల్‌ఐసి రాజమండ్రి సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ జె రంగారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి టిఎస్‌ ప్రకాష్‌, జోనల్‌ నాయకులు మహబూబ్‌, జయతీర్ధ, విశాఖ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి రమణాచలం, రాజమండ్రి డివిజన్‌ ప్రధాన కార్యదర్శి పి సతీష్‌లు ప్రసంగించారు. ఈ సందర్బంగా అఖల భారతీయ సంఘ నాయకులు సుందరం, వేణుగోపాల్‌, ఎం రాజగోపాల్‌, ప్రభాకరరావవు, సివి రావు, డాక్టర్‌ గుబ్బల రాంబాబు, ఎంఎఎఫ్‌ బెనర్జీ, ఎం కోదండరామ్‌, జివి అప్పారావు, కె వేణుగోపాలరావులను రజరోత్సవ జ్ఞాపిక, దుశ్వాలువాలతో సత్కరించారు. సమావేశానికి ముందు మహిళా ఉద్యోగుల సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా బీమా సందే గీతాలను ఆలపించారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి సుమారు 650మంది ఉద్యోగులు, సంహ కార్మిక సంఘాల నాయకులు, ఏజెంట్‌ సంఘ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.