బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో ప్రకటించాలి : మార్గాని

0
234
జయహో బీసీ నిర్వహించడానికి తెదేపాకు ఏం అర్హత ఉంది?
రాజమహేంద్రవరం, జనవరి 26 : వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో తెలుగుదేశం పార్టీ ప్రకటించాలని బీసీ సంఘాల రాష్ట్ర సమన్వయకర్త మార్గాని నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. రేపు జరగనున్న జయహో బీసీ కార్యక్రమంలో  ఈ విషయాన్ని ప్రకటించాలని పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలను అన్ని విధాల మోసం చేసిన చంద్రబాబుకు ఏం అర్హత ఉందని జయహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా మోసం చేసి ఇప్పుడు బీసీలపై హఠాత్తుగా ప్రేమ పుట్టుకు వచ్చిందా అని ప్రశ్నించారు. బీసీలను మోసం చేస్తూ  రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఆదరణ, ఆదరణ – 2  ప్రవేశపెట్టి 8 లక్షల దరఖాస్తులను స్వీకరించి వాటిని 2 లక్షలకు కుదించి 50 వేల మందికి మాత్రమే పనికి రాని పనిముట్లను ఇచ్చారని దుయ్యబట్టారు. బీసీలను అన్ని విధాల మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్‌ అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here