బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకే మద్దతు : దాస్యం

0
234
రాజమహేంద్రవరం, నవంబర్‌ 26 :   బీసీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తూ, అభివృద్ధికి ఆమడదూరాన పాలకులు నెట్టివేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దాస్యం ప్రసాద్‌ ధ్వజమెత్తారు. జిల్లా ప్రధాన కార్యాలయంలో జరిగిన సంఘ సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలకు అన్నీ పార్టీలు ఏమి న్యాయం చేస్తాయని, బీసీ సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రాతినిద్య చట్టసభల్లో తమకు అవకాశాలు పెరగాలన్నారు. ఇప్పటికై వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పార్లమెంటు సీటును కేటాయించారని, వారికి బీసీల తరుపున ప్రత్యేక అభినందనలు తెలియచేశారు. అలాగే మిగిలిన పార్టీలు కూడా బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించాలని డిమాండ్‌చేశారు. బీసీల రాజకీయ అభివృద్ది కుంటుపడేలా చేస్తే బీసీఓటర్ల ద్వారా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. వచ్చేనెలలో బీసీ యువజన సదస్సును భారీ ఎత్తున రాజమండ్రి వేదిక ఏర్పాటుచేయబోతున్నామని, దీనికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పెద్దఎత్తున పాల్గొని బీసీ యువతకు తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో యువజన సంఘం నగర, రూరల్‌ అధ్యక్షులు ఉల్లూరి రాజు, విత్తనాల శివవెంకటేష్‌, రాము, వి.వీరబాబు, పి.దుర్గాప్రసాద్‌, పి.మణికంఠ, పెండ్యాల నవీన్‌కుమార్‌, మైసర్ల సంతోష్‌, కష్టాని హేమంత్‌, గుబ్బల రవి, వారధి రాజు, కె.కుమార్‌, సతీష్‌, సంజు, బీసీ యువతపాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here