బీసీల అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం

0
155
రాజమహేంద్రవరం, మార్చి 29 : బీసీలు ఆర్థికంగా, సామాజికపరంగా అభివృద్ధి చెందాలంటే వై.ఎస్‌.జగన్‌ ముఖ్యమంత్రి కావాలని వైకాపా బీసీ సెల్‌ నగర అధ్యక్షులు మజ్జి అప్పారావు అన్నారు. మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో దానవాయిపేటలోని జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు లంక సత్యనారాయణ మాట్లాడుతూ ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో వై.ఎస్‌.జగన్‌ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారని, ఏ నాయకుడూ ప్రకటించని విధంగా జగన్‌ వరాలు కురిపించారన్నారు. మజ్జి అప్పారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలను కేవలం ఓటర్లుగా మాత్రమే చూస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ మజ్జి నూకరత్నం, దొమ్మేటి శ్రీనివాస్‌, అత్తిలి బలరామ్‌, గుణపర్తి స్వామి, టి.గౌరీశంకర్‌, అనంతలక్ష్మి, కె.దేవీ జయరాజ్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here