బ్యాంకాక్‌ పోటీలకు ఎంపికైన స్కేటింగ్‌ విద్యార్థులు

0
349

రివర్‌ రింక్‌ స్కెటింగ్‌ పక్షాన ప్రోత్సాహం అందించిన పరిమి వాసు

రాజమహేంద్రవరం, జనవరి 11 : మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌, గోవాలో డిసెంబర్‌ 27,28,29 తేదీలలో జరిగిన స్కేటింగ్‌ పోటీల్లో వీవర్స్‌ కాలనీ రివర్‌ రింక్‌ స్కేటింగ్‌ అకాడెమీకి చెందిన ముగ్గురు విద్యార్థులు విజయ కేతనం ఎగురవేసి బ్యాంకాక్‌లో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారని మాజీ కార్పొరేటర్‌, రివర్‌ రింక్‌ స్కేటింగ్‌ ప్రోత్సాహకులు పరిమి వాసు తెలిపారు. కోచ్‌ నాగబాబు, అసిస్టెంట్‌ కోచ్‌ లక్ష్మణ్‌,విజేతలైన విద్యార్థులతో కలిసి ఈరోజు ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వాసు మాట్లాడుతూ తాను కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో స్కేటింగ్‌ రింక్‌ ఏర్పాటు చేశామని, అప్పటినుంచి ఇప్పటివరకూ జీతం లేకుండా కేవలం విద్యార్థులు ఇచ్చే స్వల్పకాలిక ఫీజులతోనే కోచ్‌ నాగబాబు శిక్షణ ఇస్తూ దాదాపు రెండు వేలమంది విద్యార్థులకు స్కేటింగ్‌లో శిక్షణ ఇచ్చారని పరిమి వాసు చెప్పారు. వివిధ పోటీలలో విద్యార్థులు తమ ప్రతిభ చూపారని,ఇప్పుడు ఏకంగా ముగ్గరు విద్యార్థులు 4వ అంతర్జాతీయ ఆసియా స్కేటింగ్‌ పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు.కోచ్‌ నాగబాబు మాట్లాడుతూ మొత్తం 14మంది పోటీలకు వెళ్లారని ఇందులో దినేష్‌ కార్తీక్‌, హానిజా మోహనాజ్‌, కేశవ శివక ష్ణలు అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. చిన్ని క ష్ణ, మోనిత్‌,మొహమ్మద్‌, శివ, తనుష్‌, హర్ష, హర్షిని, నారాయణలు ఆయా విభాగాలలో ప్రతిభ కనబరిచారని చెప్పారు. ఈ సందర్బంగా అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అకాడెమీ తరపున పరిమి వాసు 10వేల రూపాయల చెక్కు అందజేశారు. అధికారులు స్పందించి కోచ్‌కి అసిస్టెంట్‌ కోచ్‌కి గౌరవ వేతనం ఏర్పాటు చేయాలని పరిమి వాసు కోరారు. అప్పడు మరింతమంది క్రీడాకారులను తీర్చిదిద్దడానికి వెసులుబాటు కలుగుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here