భక్తులకు మౌలిక సదుపాయాల కోసం గుడా నిధులు

0
445
శ్యామలాంబ దేవస్థానంలో షెడ్‌ నిర్మాణానికి శంకుస్థాపన
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 20 :  గుడా పరిధిలోని అవసరమైన వివిధ దేవాలయాల్లో యాత్రికుల మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించినట్లు గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ  అన్నారు. రూ.12.50 లక్షల గుడా నిధులతో శ్రీశ్రీశ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానంలో షెడ్‌ నిర్మాణానికి గుడా చైర్మన్‌ గన్నికృష్ణ , వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌.అమరేంద్రకుమార్‌ నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ పెద్దలు, స్థానికులు ఘనంగా స్వాగతించారు. ముందుగా అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం శంకుస్థాపన చేసి ఆలయాన్ని సందర్శించారు.చారిత్రాత్మకమైన ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు గుడా ద్వారా నిధులు మంజూరు చేశామని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆలయ ఈఒ జి.సత్య రమేష్‌కు గన్ని కృష్ణ సూచించారు. రాజమహేంద్రవరంలో కంబాల చెరువు పార్కులో వినాయక ఆలయానికి రూ.3 లక్షలు, కాకినాడలోని బాలాత్రిపురసుందరి ఆలయానికి రూ.19.95 లక్షలు, పెద్దాపురం నూకాలమ్మ ఆలయానికి రూ. 15 లక్షలు, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.15 లక్షలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రాజు, కార్పొరేటర్‌ కురుమిల్లి అనురాధ, బొతు సత్యనారాయణ, రెడ్డి మణి, శీలం శ్రీరాములు, వల్లు కొండ, చొల్లంగి సత్య, కాండ్రేగుల ఏడుకొండలు, వాసంశెట్టి సత్యనారాయణ, నరాల రమణమూర్తి, కాకి చిన్నా, వాసంశెట్టి రమణ, పిల్లి బాలు, వల్లు గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here