భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని మాస్టర్‌ ప్లాన్‌ 

0
207
పిఠాపురంలో అవగాహన సదస్సులో చైర్మన్‌ గన్ని కృష్ణ
పిఠాపురం, డిసెంబర్‌ 6 : అందరి ఆలోచనలకు, భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గుడా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించడం జరుగుతుందని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ  అన్నారు. గుడా రూపొందిస్తున్న  మాస్టర్‌ ప్లాన్‌పై లీ అసోసియేట్స్‌ సంస్థ ప్రతినిధులు పిఠాపురం పురపాలక సంఘ సమావేశపు హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధులుగా గుడా చైర్మన్‌ గన్ని, పిఠాపురం ఎమ్మెల్యే ఎన్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ, గుడా వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌.అమరేంద్రకుమార్‌, గుడా డైరెక్టర్‌ పిల్లి రవికుమార్‌, పురపాలక సంఘం చైర్మన్‌ కరణం చిన్నారావు, వైస్‌ చైర్మన్‌ పిల్లి చిన్నా, కమిషనర్‌ జి.సృజన, కౌన్సిలర్స్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ పిఠాపురంలో ప్రసిద్ధిగాంచిన కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని దృష్టిలో పెట్టుకుని మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాలని, పరిశ్రమలు, పదివేల ఎకరాల ఎస్‌.ఇ.జెడ్‌ భూములున్నాయని, ఈ నేపధ్యంలో రెసిడెన్షియల్‌ జోన్‌, కమర్షియల్‌ జోన్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రాఫ్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాక తిరిగి మరోసారి సమావేశం నిర్వహించాలని సూచించారు. గన్ని కృష్ణ   మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సిఎం చంద్రబాబు ఐదు పట్టణాభివృద్ధి సంస్థలను నెలకొల్పారని, అందులో ఏర్పాటైన గుడా అన్ని సంస్థల కన్నా అభివ ద్ధిలో వేగంగా దూసుకుపోతుందన్నారు. పిఠాపురం అభివృద్ధికి గుడా నుంచి సుమారు కోటి 70 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రానున్న 30 ఏళ్ళలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించడం జరుగుతుందన్నారు.వైస్‌ చైర్మన్‌ అమరేంద్రకుమార్‌ మాట్లాడుతూ గుడా పరిధిలో 2,183 స్క్వేర్‌ కిలోమీటర్ల పరిధి ఉందని, 26 మండలాలు,280 గ్రామాలు ఉన్నాయన్నారు. గుడా రూపొందిస్తున్న మాస్టర్‌ ప్లాన్‌పై అందరి అభిప్రాయాలను సేకరించి ఆమోదయోగ్యమైన మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తామన్నారు. లీ అసోసియేట్స్‌ ప్రతినిధులు సతీష్‌ దామోదర్‌, జి.జె.అవధానిలు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా గుడా మాస్టర్‌ ప్లాన్‌ విషయాలను వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here