భారత్‌ సైనికుల పోరాటం హర్షణీయం

0
301
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 30 : పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ దళాలు దాడులు చేసి ఉగ్రవాదులను, పాక్‌ సైనికులను మట్టుబెట్టిన తీరు హర్షణీయమని భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.వి.ఎం.కృష్ణ అన్నారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ పేరుతో ఉగ్రవాదులపై దాడి చేసి వారిని మట్టి కరిపించిన భారత్‌ సైనికుల తీరు పట్ల ఈరోజు బిజెపి నగర కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మోడీ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బర్ల శంకర్‌, బేతిరెడ్డి ఆదిత్య, కిషోర్‌ యాదవ్‌, కందికొండ రమేష్‌, బొమ్ముల చందు, వంశీ, పెరుమాళ్ళ పవన్‌, ప్రవీణ్‌, బండ శ్రీను, కుంజా వంశీ, గోలకొండ చంద్రశేఖర్‌, వాకా సుబ్రహ్మణ్యం, చల్లగాలి శ్రీనివాసవర్మ, వడ్డి నవీన్‌, సిహెచ్‌.శ్రీనివాస్‌, యోగి, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.