భారత సైన్యం పటిష్టతకు లోక్‌సత్తా సలహాలు

0
336
 
 
రాజమహేంద్రవరం, అక్టోబరు 12 : భారత బలగాలను అత్యంత పటిష్టం చేసేందుకు లోక్‌సత్తా ఉద్యమ సంస్థ కొన్ని సలహాలను అందించింది. ఈరోజు ఎ.వి.అప్పారావురోడ్‌లోని లోక్‌సత్తా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ కన్వీనర్‌ ఎం.వి.రాజగోపాల్‌ మాట్లాడుతూ సైనిక వెల్ఫేర్‌ ఫండ్‌ విషయంలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఎయిర్‌టెల్‌, ఐడియా, ఒడా ఫోన్‌ తదితర సెల్యులర్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని సైనికుల కోసం ఒక ఎస్‌ఎంఎస్‌ సిస్టమ్‌ను పెట్టి, ఒక ఎస్‌ఎంఎస్‌  సైనికుల కోసం పంపితే రూ.5లు ఖర్చయ్యేలా చూడాలని, వాటిలో రూ.10  పైసలు కంపెనీకి పోగా మిగిలిన రూ.4.90 పైసలు సైనిక వెల్ఫేర్‌ పండ్‌కు వెళ్ళేలా ఆలోచనలు చేయాలని కోరారు. ప్రజాప్రతినిధులు తమ సంవత్సర ఆదాయంలో ఒక నెల వేతనాన్ని సైన్యానికి అందించాలని సూచించారు. ఆర్మీ వెల్ఫేర్‌ అందించేందుకు విరాళం అందించడానికి సులువుగా డినామినేషన్‌ స్టాంప్‌లను ప్రవేశపెట్టాలన్నారు. లోక్‌సత్తా నాయకులు జె.రవి మాట్లాడుతూ ఫండ్‌ విషయంలో ప్రభుత్వం విశేష ప్రచారం కల్పించాలని, పాకిస్తాన్‌కు సహకరిస్తున్న చైనాకు బుద్ధి చెప్పాలంటే ఆ దేశానికి చెందిన బాణాసంచా, ఇతర వస్తువులను వినియోగించరాదని సూచించారు. శంకర్‌ యాదవ్‌ మాట్లాడుతూ సైనిక వెల్ఫేర్‌ ఫండ్‌కు ఎం.వి.రాజగోపాల్‌ రూ.5వేలు, లోక్‌సత్తా సంస్థ తరపున రూ.5వేలు విరాళం అందిస్తున్నారని, సంస్థలోని ప్రతి సభ్యుడు కనీసం రూ.500 విరాళం ఇచ్చేందుకు తీర్మానించామన్నారు. విద్యా సంస్థలు, ముఖ్య కూడళ్ళకు వెళ్ళి ఫండ్‌పై విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. సంస్థ కోశాధికారి ఎన్‌.ఎస్‌.రామచంద్రమూర్తి గతంలో జరిగిన యుద్ధాలు, ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ మోడీని బలపర్చాలని కోరారు.