భూనీళా వెంకటేశ్వరాలయంలో రేపటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు

0
245
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 15 : స్ధానిక సీతంపేట జమిందార్‌ మెట్టపై చైతన్య హాస్పటల్‌ పక్కన ఉన్న శ్రీ భూనీళా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయం లో  రేపటి నుంచి వచ్చే నెల 14 వ తేదీ వరకు ధనుర్మాస  మహోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్తలు శ్రిఘాకొళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం తెలిపారు. తరతరాలుగా పెద్దలు  ఆచరిస్తూ వస్తున్న ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రతి సంవత్సరం శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి వారు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ  ఆయా ప్రాంతాల్లోని భక్తులను తరింపజేస్తున్నారని, చిన జీయర్‌ స్వామి, త్రిదండి అహోబిల జీయర్‌స్వామి వార్ల మంగళాశాసనాలతో నిర్మించిన ఈ ఆలయంలో ఈ ఏడాది  ధనుర్మాస ఉత్సవాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. భక్తులు ఈ ధనుర్మాస ఉత్సవాల్లో పాల్గొని శ్రీగోదా రంగనాథుల, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల అనుగ్రహాన్ని , జీయర్‌ స్వామివార్ల మంగళా శాసనాలను పొంది తరించాలని శివరామసుబ్రహ్మణ్యం కోరారు.