భూ ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి

0
428
త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశం : ఎస్సీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ శివాజీ
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 10 : జిల్లాలో ఆక్రమణకు గురైన ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూములపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని, త్వరలోనే ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ తెలిపారు. ఈరోజు ఆర్‌ అండ్‌ బి అతిధి గృహంలో కమిషన్‌ ప్రజల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్భంగా కారెం శివాజీ మాట్లాడుతూ అసైన్డ్‌ భూములు, ల్యాండ్‌ సీలింగ్‌ భూములు, స్మశాన వాటిక భూములు ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. పేదవారికి కేటాయించిన భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఏజెన్సీలో గిరిజనుల ఆరోగ్యంపై వైద్యాధికారులతో చర్చించామని, త్వరలోనే ఆ ప్రాంతంలో పర్యటిస్తామన్నారు. చంద్రన్న భీమా పథకం అందరికీ వర్తిస్తుందని, అసంఘటితరంగ కార్మికులు ఈ పథకాన్ని సద్వినియోగపర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ కె.డేవిడ్‌రాజు, మాజీ కార్పొరేటర్‌ అజ్జరపు వాసు, పిల్లి రమేష్‌, కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి రాజేంద్రప్రసాద్‌, తుమ్మల తాతారావు, జార్జి ఆంథోని తదితరులు పాల్గొన్నారు.